మోదీ ప్రభుత్వంపై కేజ్రీ ఫైర్.. | Kejriwal slams Modi government for overexpenditure on advertisements | Sakshi
Sakshi News home page

మోదీ ప్రభుత్వంపై కేజ్రీ ఫైర్..

May 26 2016 12:04 PM | Updated on Aug 21 2018 9:33 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేస్తున్న ప్రచార హడావిడిపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. కేవలం ఈ ప్రచారం కోసం 1,000 కోట్లకు పైగా మోదీ ప్రభుత్వం ఖర్చు చేసినట్లు సమాచారం అందిందని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు.

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలు కలిసి కూడా ఒక సంవత్సర కాలంలో 150 కోట్లకు మించి ప్రచారానికి ఖర్చు చేయలేదని కేజ్రీవాల్ వెల్లడించారు. భారతీయ జనతాపార్టీ చేస్తున్న అధిక ప్రచార వ్యయంతో విభేదిస్తున్నట్లు ఆయన తెలిపారు. సరి-భేసి విధానం అమలు సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం చేసినటువంటి ప్రచార ఆర్భాటానికి ప్రతిపక్షాల నుంచి కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement