డబ్బులు ఇస్తానని మహిళతో అసభ్యంగా.. | Karnataka mob thrashes UP man for misbehaving with woman | Sakshi
Sakshi News home page

డబ్బులు ఇస్తానని మహిళతో అసభ్యంగా..

May 23 2016 1:57 PM | Updated on Aug 11 2018 8:48 PM

డబ్బులు ఇస్తానని మహిళతో అసభ్యంగా.. - Sakshi

డబ్బులు ఇస్తానని మహిళతో అసభ్యంగా..

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని స్థానికులు చితకబాదారు. కర్ణాటకలోని మంగళూరులో ఆదివారం ఈ ఘటన జరిగింది.

మంగళూరు: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని స్థానికులు చితకబాదారు. కర్ణాటకలోని మంగళూరులో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు మంగళూరు సిటీ బస్‌ స్టేషన్‌ వద్ద ఓ మహిళకు డబ్బులు చూపి.. వస్తావని అడిగాడు. స్థానికంగా ఉద్యోగం చేసే ఆమె అతని ప్రవర్తన పట్ల అభ్యంతరం తెలిపింది. తనపట్ల అతను అసభ్యంగా ప్రవర్తించడాన్ని నిలదీసింది. దీంతో నలుగురు గూమిగుడి అతడిని చితకబాదారు.

అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం చేసే మహిళగా భావించి తాను అలా అడిగానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement