జేఎన్‌యూ విద్యార్థిగా ‘కంచ ఐలయ్య’

Kancha Illaiah As A JNU Student! - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ మనిషి జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోకి వెళుతుండగా పోలీసులు ఆపి ‘లోపల గొడవలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పేరెంట్స్, సంరక్షకులు లోపలికి పోరాదు’ అని చెప్పారు. ‘కానీ నేను జేఎన్‌యూ విద్యార్థిని’ అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చారు. ఆయనకు 47 ఏళ్లు. కేరళకు చెందిన ఆయన పేరు మొహినుద్దీన్‌. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా 1989 నుంచి జేఎన్‌యూలో  చదువుతున్నారు. అనే పోస్ట్‌ ఫేస్‌బుక్‌లో గత కొన్ని రోజులుగా వైరల్‌ అవుతోంది. 

జేఎన్‌యూలో హాస్టల్‌ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ వామపక్ష, కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుండగా, ఫీజుల పెంపును బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు సమర్థిస్తున్న విషయం తెల్సిందే. హాస్టల్‌ ఫీజులు అతి తక్కువగా ఉండడం వల్లనే 47 ఏళ్లు వచ్చిన వారు కూడా ఇప్పటికీ విద్యార్థులుగా హాస్టల్లో ఉంటున్నారన్న ఉద్దేశంతో జేఎన్‌యూ విద్యార్థుల పేరిట ‘శాస్త్రీ కౌశాల్‌కిషోర్డ్‌’ పేరిట ఓ అమ్మాయి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా, వాసుదేవ్‌ జీ రామ్‌నాని, సుశీల్‌ మిశ్రా, హరిదాస్‌ మీనన్‌ తదితరులు రీపోస్ట్‌ చేశారు. 

ఈ పోస్ట్‌ను ఎంతవరకు నమ్మారో తెలియదు. కేరళకు చెందిన మొహినుద్దీన్‌ అంటూ పెట్టిన ఫొటోను చూసిన వారు మాత్రం ఎవరూ నమ్మడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్‌ జిల్లా వాసి ‘కంచ ఐలయ్య’ ఫొటో అది. తెలుగు వారందరికి అతను సుపరికితులే. ‘కంచ ఐలయ్య గొర్రెలకాపరి’ అని గర్వంగా చెప్పుకునే ఆయన ప్రముఖ దళితుల హక్కుల కార్యకర్త. రాజకీయ తత్వవేత్త, రచయిత. ‘వైశ్యాస్‌: సోషల్‌ స్మగ్లర్స్‌’ అంటూ ఆయన రాసిన పుస్తకం వివాదాస్పదమైంది. 

ఉస్మానియా యూనివర్శిటీలో ‘బుద్దిజం’లో పీహెచ్‌డీ చేసిన ఆయన హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ (ఎంఏఎన్‌యూయూ)లో ‘సెంటర్‌ ఫర్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ’ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం జెఎన్‌యూలో పీహెచ్డీ చేస్తున్న స్కాలర్లలో కూడా 47 ఏళ్ల మొహినుద్దీన్‌యే కాకుండా అసలు 40 ఏళ్లు దాటిన వారే లేరని వామపక్ష విద్యార్థి సంఘాలు తెలిపాయి. 

చదవండి:

వీడియోలో ఉన్నది నేను కాదు: కోమల్

జేఎన్యూ హింస: ముసుగు ధరించింది ఆమె!

ఎందుకు అరెస్టు చేయలేదు?

అర్బన్ నక్సల్స్తోనే జేఎన్యూకు అపకీర్తి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top