అమిత్ షా ముందు యోగా చేయాలి: జేడీయూ | JDU: Unfit Amit Shah should practice Yoga before preaching | Sakshi
Sakshi News home page

అమిత్ షా ముందు యోగా చేయాలి: జేడీయూ

Jun 19 2016 11:13 AM | Updated on May 28 2018 3:58 PM

బీజేపీ, జేడీయూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యోగాను రాజకీయం చేస్తున్నారని జేడీయూ మండి పడుతోంది. ముందుగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా యోగా గురించి సందేశాలు ఇచ్చే ముందు ఆయన యోగా చేయాలని ఆయన శరీరం చూస్తే యోగా చేయని విషయం తెలుస్తోందని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ విమర్శించారు.

పాట్నా: బీజేపీ, జేడీయూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యోగాను రాజకీయం చేస్తున్నారని జేడీయూ మండి పడుతోంది. ముందుగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా యోగా గురించి సందేశాలు ఇచ్చే ముందు ఆయన యోగా చేయాలని ఆయన శరీరం చూస్తే యోగా చేయని విషయం తెలుస్తోందని  జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ విమర్శించారు. పాట్నాలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ...  ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రపంచ మోగా దినో్త్సవాన్ని గుర్తించడానికి నిరాకరిస్తున్నారని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుషీల్ కుమార్ మెదీ విమర్శించిన  నేపథ్యంలో స్పందించిన నీరజ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ తానే యోగాను ప్రపంచానికి పరిచయం చేసినట్టు భావిస్తోందని విమర్శించారు.
 
యోగా  పవిత్ర మైందని బిహార్ పురాతన ఆస్తి అని  నీరజ్ అన్నారు. యోగాను ప్రపంచం గుర్తిస్తుంటే నితీష్ కుమార్ వ్యతిరేకిస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన  స్పందిస్తూ  నితీష్  కుమార్ ప్రతిరో్జు  యోగా చేస్తారని తెలిపారు.యోగాను రాజకీయం్ చేయడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అమిత్ షా శరీరాన్ని చూస్తే యోగా  చేయని విషంయం తెలుస్తోందని ముందు ఆయన యోగాపై ఉపన్యాసాలిచ్చేముందు యోగా ప్రాక్టీస్ చేయాలని నీరజ్ కుమార్ తెలిపారు. షా ఈ నెల 21 పాట్నాలో జరిగే యోగా దినోత్సవంలో ప్రసంగించనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement