ముగిసిన ప్రధాని షింజో అబే భారత్‌ పర్యటన.. | Japanese PM Shinzo Abe concludes three days of India tour | Sakshi
Sakshi News home page

ముగిసిన ప్రధాని షింజో అబే భారత్‌ పర్యటన..

Dec 13 2015 9:57 AM | Updated on Aug 15 2018 2:20 PM

జపాన్‌ ప్రధాని షింజో అబే భారత్‌లో మూడు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరుగు పయనమయ్యారు.

ఢిల్లీ: జపాన్‌ ప్రధాని షింజో అబే భారత్‌లో మూడు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆదివారం స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఢిల్లీలో భారత్‌-జపాన్‌ 9వ వార్షిక సదస్సులో భాగంగా శనివారం భారత్‌ వచ్చిన ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో  సమావేశమై.. పౌర అణు ఒప్పందంతోపాటు భారత్‌లో తొలి బుల్లెట్ రైలు ట్రాక్ కోసం రూ.98వేల కోట్ల డీల్, స్మార్ట్‌సిటీలకు సహకారం, పలు మౌలికవసతుల ప్రాజక్టులపై  ఒప్పందాలు చేసుకోనున్నారు.

సదస్సు పూర్తయిన తర్వాత మోదీ, అబే అదే రోజు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. దశాశ్వమేధఘాట్ వద్ద గంగా హారతిని తిలకించారు. ఇందుకోసం అలహాబాద్ హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని గంగా తీరాన భారీ వేదిక ఏర్పాటు చేశారు. శుక్రవారం జపాన్‌ ప్రధాని అబేకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి జయంత్ సిన్ ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement