హాకీ ప్లేయర్‌ అనుమానాస్పద మృతి | jamia student found dead in car with bullet wound | Sakshi
Sakshi News home page

హాకీ ప్లేయర్‌ అనుమానాస్పద మృతి

Dec 6 2017 10:27 AM | Updated on Nov 9 2018 5:02 PM

jamia student found dead in car with bullet wound - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ కాలేజీ విద్యార్థి అనుమానాస్పద మరణం కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని సరోజినీ నగర్‌లో తన సొంత కారులో చనిపోయి ఉన్నాడు. జామి మిల్లియా ఇస్లామియా కాలేజీలో బీఏ చదువుతున్నా రిజ్వాన్‌ఖాన్‌(22) స్టేట్‌ లెవల్‌ హాకీ  క్రీడాకారుడు కూడా.  హతుడి కుడిచేతికి బుల్లెట్‌ గాయాలు  ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే రిజ్వాన్‌ ది హత్యా, ఆత్మహత్యా అనేది ఇంకా  తేలాల్సి వుంది. ప్రేమ వ్యవహారమే కారణమా అనే  సందేహాలను పోలీసులు వ్యక్తం చేశారు.  

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోమిల్ బానియా రిపోర్ట్‌ ప్రకారం రిజ్వాన్‌ఖాన్‌  సుభాష్ నగర్ నివాసి.  బైక్‌ కొనుక్కుంటానని  చెప్పి సోమవారం సాయంత్రం రిజ్వాన్ ఇంటినుంచి  రూ.2 లక్షలు తీసుకొని వెళ్లాడు.  రాత్రి ఇంటికి రాలేదు. మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ లో వుంది   ఇంతలో, మంగళవారం ఉదయం10.30 గంటలకు ఎవరో ఫోన్‌ చేసి రిజ్వాన్‌బ్యాగ్‌ తమ దగ్గర ఉందని వచ్చి తీసుకెళ్లమని చెప్పారని రిజ్వాన్‌ తండ్రి చెప్పారు. వెంటనే అక్కడికి  వెళ్లామనీ,  స్విఫ్ట్‌ కారు పార్క్‌ చేసి ఉండడాన్నిగమనించి , పరిశీలించగా రక్తపు మడుగులో పడివున్న రిజ్వాన్‌ మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు.

రిహ్వాన్ రోహతాక్‌లోని కళాశాలలో చదువుతున్న ఓ అమ్మాయితో  మహిళతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెను కలవడానికి  వెళ్లాడని, అయితే ఆమె ఒడిషా వెళ్లడంతో  రాత్రంతా కారులో కూర్చున్నాడని పోలీసులు చెప్పారు. ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించినట్లు,  పలుమార్లు ఆమెకు ఫోన్‌ చేసినట్టు గుర్తించామని తెలిపారు. దేశపు తుపాకీ,, రూ.2 లక్షలు నగదు, మొబైల్ ఫోన్‌తోపాటు అమ్మాయి ఫోటో కూడా  ఉన్న బ్యాగ్‌ను  స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.  ఎలాంటి సూసైట్‌నోట్‌ లభించలేదని విచారణ  నిర్వహిస్తున్నాని చెప్పారు అయితే అమ్మాయి తరపువారే తమ కుమారుడిని హత్య చేసి వుంటారని రిజ్వాన్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement