పక్కా సమాచారంతో దాడి.. ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం | Jaish E Terrorists Gunned Down And A Jawan Martyred In Kulgam In Kashmir | Sakshi
Sakshi News home page

పక్కా సమాచారంతో దాడి.. ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం

Feb 24 2019 5:00 PM | Updated on Feb 24 2019 7:57 PM

Jaish E Terrorists Gunned Down And A Jawan Martyred In Kulgam In Kashmir - Sakshi

ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆదివారం కార్డన్‌ సెర్చ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

న్యూఢిల్లీ : కశ్మీర్‌ లోయలో మరో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కుల్గామ్‌ జిల్లాలోని తురిగామ్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆదివారం కార్డన్‌ సెర్చ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టే క్రమంలో క్రమంలో ఓ పోలీస్‌ అధికారి, ఓ ఆర్మీ జవాన్‌ మరణించారు. ఓ ఆర్మీ మేజర్‌, ఇద్దరు జవాన్లు, ఒక హవల్దార్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అమరుడైన పోలీస్‌ అధికారిని డీఎస్పీ (ఆపరేషన్స్‌) అమన్‌ ఠాకూర్‌గా గుర్తించారు. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు అసువులుబాసిన విషయం తెలిసిందే. (బాధను భరిస్తూ కూర్చోం)

(చదవండి : ఇమ్రాన్‌.. అమాయకత్వపు ముసుగు తీసేయ్‌: ఒవైసీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement