యూపీలో కుప్పకూలిన యుద్ధవిమానం

Jaguar fighter plane crashes in UP's Kushinagar - Sakshi

లక్నో : భారత వాయుసేనకు చెందిన జాగ్వర్‌ యుద్ధ విమానం సోమవారం యూపీలోని ఖుషీనగర్‌ జిల్లాలో కుప్పకూలింది. గోరఖ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరిన విమానం హెతింపిర్‌ ప్రాంతం వద్ద కూలిపోయింది. విమాన ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

కాగా గత ఏడాది జూన్‌లో గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో జాగ్వర్‌ యుద్ధ విమానం కూలిన ఘటనలో విమానం నడుపుతున్న సీనియర్‌ అధికారి మరణించారు. బరేజా గ్రామంలో విమానం కుప్పకూలడంతో పైలట్‌గా ఉన్న వాయుసేన పతక గ్రహీత, జామ్‌నగర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ ఎయిర్‌ఆఫీసర్‌ కమాండింగ్‌ సంజయ్‌ చౌహాన్‌ మరణించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top