
ఇంకా తెరుచుకోని జమ్మూశ్రీనగర్ హైవే
జమ్మూ కశ్మీర్ ప్రజలు రవాణా సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రాంతానికి మరో ప్రాంతానిక సంబంధాలు ఆగిపోయి అవస్థలు ఎదుర్కొంటున్నారు.
జమ్మూ కశ్మీర్ ప్రజలు రవాణా సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రాంతానికి మరో ప్రాంతానిక సంబంధాలు ఆగిపోయి అవస్థలు ఎదుర్కొంటున్నారు. గత సోమవారం మంచు తుఫాను, కొండచరియల కారణంగా మూతపడిన జమ్మూ శ్రీనగర్ మధ్య ఉన్న 300 కిలోమీటర్ల రహదారి వరుసగా ఐదో రోజు కూడా తెరుచుకోలేదు. రహదారిని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు, స్థానికులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. రోడ్డుపై పేరుకు పోయింది పెద్ద పెద్ద కొండచరియలు కావడంతో కాస్తంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జమ్మూ రాజధాని శ్రీనగర్ను కలిపే ఏకైక రహదారి ఇదే. కాగా, మార్చి 8 వరకు ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదని, ఆర్ధ్రతతో కూడి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు.