
సాక్షి,హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో పోలీస్‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు..గణేష్ నిమజ్జనం సందర్భంగా 2025 సెప్టెంబర్ 5 ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 6 సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేస్తున్నట్లు తెలిపింది.
రెస్టారెంట్లకు అటాచ్ అయిన బార్లు కూడా మూసివేతకు లోబడి ఉంటాయి.అయితే స్టార్ హోటల్స్,రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లకు మినహాయింపు ఇచ్చింది.ఇందుకు ప్రజలు సహకరించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.