breaking news
ganesh immerrsion
-
బాలాపూర్ లడ్డూ మోదీకి అంకితం: కొలను శంకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ గణపతి లడ్డూ వేలంలో మరోసారి రికార్డు స్ధాయి ధర పలికింది. చరిత్రను తిరగరాస్తూ ఈసారి రూ.30లక్షల ఒక వేయికి లడ్డూను దక్కించుకున్నారు బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి. ఈ సందర్భంగా లడ్డూను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. త్వరలో ఢిల్లీకి వెళ్లి పూర్తి లడ్డూను ఆయనకే అందిస్తానని చెప్పారు. వేలం పాట రూ.1116తో ప్రారంభమై.. క్రమంగా పెరుగుతూ.. రూ.30 లక్షల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత ఎవరూ వేలం పాట పాడేందుకు ముందుకు రాకపోవడంతో కొలను శంకర్ రెడ్డికే బాలాపూర్ లడ్డూ దక్కింది. గతేడాది కూడా లడ్డూ రూ.27లక్షల పలికిన విషయం తెలిసిందే. దీంతో, గతేదాడి కంటే మూడు లక్షల ఒక్క వేయి ఎక్కవ పలికింది. కాగా, బాలాపూర్ లడ్డూ వేలం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకమైంది. లడ్డూను దక్కించుకునేందుకు ఎంతో మంది ముందుకు వస్తుంటారు. ఇక, ఈ ఏదాడికి బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి అయ్యింది. 1994లో తొలిసారి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. తొలిసారి వేలంలో లడ్డూ రూ.450 పలికింది. ఇక, 30 ఏళ్ల నాటికి లడ్డూ ఏకంగా రూ.30లక్షలకు చేరుకుంది. ఇదే ఓ రికార్డుగా స్థానికులు చెప్పుకుంటున్నారు.30ఏళ్లుగా వేలం ఇలా..1994లో తొలిసారి రూ.450తో ప్రారంభం 2016లో రూ.14.65 లక్షలు, 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో 17.60 లక్షలు, 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు 2023లో రూ.27 లక్షలు 2024లో రూ.30,01,000(30లక్షల ఒక వేయి). ఇది కూడా చదవండి: వేలంలో రికార్డులు పటాపంచల్.. గణేశుడి లడ్డూ@ రూ.1.87 కోట్లు -
గణేష్ నిమజ్జనాలపై సీవీ ఆనంద్ కీలక ప్రెస్ మీట్
-
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఎన్ని గంటలకంటే..
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రకు ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజు అర్థరాత్రి చివరి పూజ అనంతరం నిమజ్జనానికి సిద్ధమయ్యారు. చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అటు.. రేపు జరగబోయే శోభాయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను ఉత్సవ సమితి చేసింది. ఖైరతాబాద్ వినాయకునికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. తొమ్మిది రోజులుగా పూజలు నిర్వహించిన ఉత్సవ సమితి నేడు అర్ధరాత్రి ఇక చివరి పూజను నిర్వహించనుంది. అర్ధరాత్రి 1 గంట తర్వాత మహాగణపతిని ఉత్సవ సమితీ కదిలించనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలలోపు మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర సాగుతుంది ఇలా.. ►ఈ రోజు అర్థరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరి పూజ ►అర్దరాత్రి 1 గంట తర్వాత మహాగణపతిని కదిలించనున్న ఉత్సవ కమిటీ ►రాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 వరకు విగ్రహాలను భారీ టస్కర్ లోకి ఎక్కించనున్న కమిటీ ►ఉదయం 4 నుంచి 7 వరకు మహాగణపతిని భారీ వాహనంపై ఎక్కించి వెల్డింగ్ వర్క్ ►ఉదయం ఎనిమిది గంటల లోపు ప్రారంభం కానున్న మహా గణపతి శోభాయాత్ర ►టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకోనున్న మహా గణపతి ►ఉదయం 10 గంటల సమయంలో క్రేన్ నెంబర్ 4 వద్ద కు చేరుకునే అవకాశం ►తర్వాత భారీ వాహనంపై మహాగణపతి తొలగింపు కార్యక్రమం ►క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద ఉదయం 11 నుంచి 12 గంటల లోపు పూజా కార్యక్రమం ►12 నుంచి హుస్సేన్ సాగర్ లో మహాగణపతి నిమజ్జన కార్యక్రమం షురూ ►మ. 2 గంటల లోపు మహా గణపతి నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. మహాగణపతి నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్లలో పడిపోతే రక్షించేందుకు 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేసింది. అలాగే, శోభాయాత్ర జరిగే రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచింది. నిమజ్జనానికి తరలివచ్చే వారి కోసం జలమండలి 10 లక్షల నీళ్ల ప్యాకెట్లను రెడీ చేసింది. నిమజ్జనం రోజున ప్రజల సౌకర్యార్థం హుస్సేన్ సాగర్‌కు నగరం నలుమూలల నుంచి 535 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే 29 తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మెట్రో రైళ్లు కూడా రేపు అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నడవనున్నాయి. ఇదీ చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు..
-
నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు..
గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సౌత్ జోన్: కేశవగిరి, మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్స్, ఇంజిన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మాత్పుర, హరిబౌలి, అస్రా హాస్పిటల్, మొఘుల్పుర, లక్కడ్ కోటే, మదీనా ఎక్స్ రోడ్డు, ఎంజే బ్రిడ్జి, దార్ ఉల్ సిఫా ఎక్స్ రోడ్స్, సిటీ కాలేజ్ ఈస్ట్ జోన్: చంచల్‌గూడ జైలు ఎక్స్ రోడ్స్, మూసారం బాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జి, సలర్జంగ్ బ్రిడ్జి(శివాజీ బ్రిడ్జి), అఫ్జల్‌గంజ్, పుతిలిబౌలి ఎక్స్ రోడ్స్, ట్రూప్ బజార్, జామ్‌బాగ్ ఎక్స్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ కోఠి వెస్ట్ జోన్: టోప్‌ఖానా మసీద్, అలస్కా హోటల్ జంక్షన్, ఉస్మాన్‌గంజ్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్ సెంట్రల్ జోన్: చాపెల్ రోడ్డు ఎంట్రీ, జీపీఓ, శాలిమార్ థియేటర్, గన్‌ఫౌండ్రీ, స్కైలైన్ రోడ్డు, దోమలగూడలోని భరత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెంటర్ జంక్షన్, కంట్రోల్ రూమ్, లిబర్టీ సెంటర్, ఎంసీహెచ్ ఆఫీస్ వై జంక్షన్, బీఆర్కే భవన్ జంక్షన్, ఇక్బల్ మినార్, రవీంధ్ర భారతి, ద్వారకా హోటల్ జంక్షన్, ఖైరతాబాద్ జంక్షన్, చిల్డ్రన్స్ పార్క్, వైశ్రాయ్ హోటల్ జంక్షన్, కవాడిగూడ జంక్షన్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరా పార్క్ జంక్షన్ నార్త్‌జోన్: సీటీవో, వైఎంసీఏ, ప్యారడైస్ ఎక్స్ రోడ్డు, ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, బాటా ఎక్స్ రోడ్డు, అదవయ్య ఎక్స్ రోడ్డు, గన్స్ మంది ఎక్స్ రోడ్డులు. కర్బలా మైదాన్, బుద్ధభవన్, సైలింగ్ క్లబ్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్‌రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్‌లోని అనుమతి లేదు. (ఆదివారం ఉదయం ఆరు నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ ఆంక్షలు ఆమల్లో ఉంటాయి) పార్కింగ్ ఇక్కడ చేయండి ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ జెడ్సీ ఆఫీసు, బుద్ధభవన్ వెనకల, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్, ఎన్టీఆర్ స్టేడియం, నిజామ్ కాలేజ్, పబ్లిక్ గార్డెన్స్ సిటీ సర్వీసెస్ బస్సులు నిలుపు స్థలాలు మెహదీపట్నం బస్సులు మాసబ్ ట్యాంక్ వరకు కూకట్పల్లి బస్సులు వీవీ విగ్రహం వరకు సికింద్రాబాద్ బస్సులు...సీటీవో, ప్లాజా, ఎస్బీహెచ్, క్లాక్ టవర్, చిలకలగూడ ఎక్స్ రోడ్డు రామాంతపూర్ టీవీ స్టేషన్ దిల్సుఖ్నగర్ బస్సులు...గడ్డి అన్నారం, చాదర్‌ఘాట్ రాజేంద్రనగర్ బస్సులు..దానమ్మ హట్స్ మిధానీ బస్సులు...ఐఎస్ సదన్ ఇంటర్ సిటీ స్పెషల్ బస్సులు...వైఎంసీఏ నారాయణగూడ తార్నాక: తార్నాక జంక్షన్ నుంచి జామియా ఉస్మానియా ఫ్లైఓవర్‌కు ఆర్టీసీ బస్సులకు అనుమతి లేదు. శోభాయాత్ర సాగేదిలా.. నగరంలో గణేశ్ నిమజ్జనయాత్రను సాఫీగా నిర్వహించేందుకు నగర, సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. మెట్రో నిర్మాణ పనులతో శోభాయాత్రకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ప్రాంతాలు, నిమజ్జనం తర్వాత వెళ్లాల్సిన మార్గాలను నగర పోలీసు కమిషనర్ శుక్రవారం విడుదల చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద వైభవంగా జరిగే నిమజ్జన దృశ్యాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం కూడా బస్సులు ఉంటాయని, అయితే నిర్ణీత సూచించిన ప్రదేశంలో వాటిని నిలుపనున్నారని చెప్పారు. నిమజ్జనం తర్వాత ఇలా వెళ్లాలిలా... ఎన్టీఆర్ మార్గ్ ఘాట్: నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ విగ్రహం, కేసీపీ మీదుగా వాహనాలు వెళ్లాలి. తెలుగు తల్లి, మింట్ కాంపౌండ్ మీదుగా అనుమతించరు. అప్పర్ ట్యాంక్ బండ్ ఘాట్: చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడి గూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. బ్రిడ్జ్‌పై నుంచి బైబిల్ హూస్ రైల్ మీదుగా అనుమతి లేదు. భారీ వాహనాలకు నో పర్మిషన్... అంతర్రాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి వచ్చే భారీ వాహనాల(లారీ)లను 27 రాత్రి నుంచి 28వ తేదీ వరకు రాకపోకలు నిషేధించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు శివారు ప్రాంతాల్లోనే ఉండాలి. ఎంజీబీఎస్‌కు వెళ్లే అంతర్రాష్ట్ర, జిల్లా బస్సులను కూడా 27వ తేదీ ఉదయం పది నుంచి 28వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అనుమతి లేదు. ప్రత్నామ్యాయ మార్గాల్లో బస్సులు నిలిపాల్సి ఉంటుంది. ప్రైవేట్ బస్సులకు నగరంలోకి అనుమతి ఉండదు. ప్రయాణికులు ఈ మార్గాల్లో రావద్దు ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు, అక్కడి నుంచి వచ్చేవారు నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ రోడ్డు, అంబేద్కర్ విగ్రహం నుంచి ఫలక్‌నుమా ప్రధాన రహదారి వరకు మార్గాలకు రావద్దు. రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి వచ్చేవారు కూడా ఇదే నిబంధనను పాటించాలి. హైదరాబాద్ శోభయాత్ర మార్గాలివే... -కేశవగిరి నుంచి ప్రధాన శోభయాత్ర మొదలై అలియాబాద్, నాగుల్ చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ, అప్పర్‌ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వరకు చేరుకుంటుంది. కొన్ని జంక్షన్ల వద్ద ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గణనాథులు కూడా కలిసి ఈ మార్గాల్లోనే హుస్సేన్‌సాగర్‌కు చేరుకుంటాయి. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహలను ఆర్పీ రోడ్డు, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ ఎక్స్ రోడ్డు, హిమాయత్‌నగర్ వై జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్ చేరకుంటాయి. ఉప్పల్, రామాంతపూర్, అంబర్పేట్, ఓయూలోని ఎన్సీసీ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రి నుంచి వచ్చే వాహనాలు ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా ట్యాంక్‌బండ్ చేరుకుంటాయి. వెస్ట్‌జోన్ నుంచి వచ్చే కొన్ని గణనాథులు ఎంజే మార్కెట్, సెక్రటేరియట్-తెలుగు తల్లి విగ్రహం వద్ద కలుసుకొని నిమజ్జన ఘాట్‌కు చేరుకుంటాయి. ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ ప్రధాన శోభయాత్ర ఆయా మార్గాల్లో జరగనుంది.