
బెంగళూరు: కర్ణాటకలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గణేష్ నిమజ్జన ఊరేగింపుపైకి ఓ లారీ దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న మొసలె హోసహళ్లి రైల్వే గేటు సమీపంలో జరిగింది. మొసలె హోసహళ్లి, హిరెహళ్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినాయక నిమజ్జనం కోసం శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంతో, నిర్లక్ష్యంగా వచ్చిన కార్గో లారీ.. అక్కడున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో మొదట ఓ బైక్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత డివైడర్‌ను ఢీకొని, చివరకు ఊరేగింపులో ఉన్న భక్తులను చిదిమేసింది. ఈ ఘటనతో వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని హసన్, హోళెనరసిపుర పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, లారీ డ్రైవర్ భువనేశ్‌ను బయటకు లాగి చితకబాదారు. ప్రస్తుతం అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.
Visuals ⚠️ Horrific tragedy in Hassan, Karnataka: A speeding tanker truck rammed into a Ganesh festival procession on NH-373 near Mosalehosalli village.
4 dead on the spot, 20+ seriously injured. Rescue ops underway. Intentions unknown!! pic.twitter.com/jipF27Frfi— महावीर जैन, ಮಹಾವೀರ ಜೈನ, Mahaveer Jain (@Mahaveer_VJ) September 13, 2025