మోదీ భద్రతకు ఇజ్రాయెల్‌ జాగిలాలు | Israeli dogs for PM security | Sakshi
Sakshi News home page

మోదీ భద్రతకు ఇజ్రాయెల్‌ జాగిలాలు

Aug 6 2017 5:58 PM | Updated on Aug 15 2018 6:34 PM

మోదీ భద్రతకు ఇజ్రాయెల్‌ జాగిలాలు - Sakshi

మోదీ భద్రతకు ఇజ్రాయెల్‌ జాగిలాలు

భారత ప్రధాని మోదీ భద్రతలో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ భద్రతలో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచం‍లోనే అత్యంత పేరున్న స్నిఫర్ డాగ్స్‌ను దిగుమతి చేసుకున్నారు. పేలుడు పదార్థాలు, బాంబులను సమర్థవంతంగా కనిపెట్టడంతో పాటు నేరస్థులను పట్టుకోవడంలోనూ స్నిఫ్ అండ్ అటాక్ డాగ్స్ కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల భద్రతకు ఇపుడు వీటిని  వినియోగిస్తున్నారు. ఇప్పడు అలాంటి జాగిలాలనే భారత ప్రభుత్వం ఇస్రాయిల్ నుంచి తెప్పించింది.

గత ఏడాది 30 అటాక్ డాగ్స్, బాంబు స్నిఫర్ డాగ్స్, చేజర్స్ లను జెరుసలామ్ నుంచి తెప్పించినట్లు సీనియర్ సెక్యురిటీ అధికారి ఒకరు  తెలిపారు. తాజాగా ఇస్రాయిల్‌ రక్షణ రంగంలో మేటిగా నిలిచిన కానైన్లు - లాబ్రడార్లు, జర్మన్ షెప్పర్లు, బెల్జియన్ మాలిటియోస్ జాతులను దిగుమతి చేసుకున్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోదీకి ముప్పు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. వీటి ధర మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు. మోదీ గత నెలలో ఇస్రాయిల్ పర్యటనలో ఆదేశ ప్రధాని బెంజామిన్ నెటాన్యుహుతో భద్రత, రక్షణ తదితర అంశాల గురించి మోదీ చర్చించారు.

ఈ డాగ్స్ కి దాదాపు 6నెలలపాటు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ శిక్షణ కాలంలో కుక్కలకు ప్రత్యేకమైన ఆహారం, నివాస వాతావరణం ఏర్పాటు చేశారు.అంతేకాకుండా వాటికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. తరచూ వైద్యలు చేత పరీక్షలు కూడా చేయిస్తూ ఉంటారని భద్రతా అధికారి తెలిపారు. భారత మాజీ ప్రధానుల కుటుంబాలకు సైతం ఈ భద్రత వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement