
రైల్వేలో పెట్టుబడులు పెట్టండి: దత్తాత్రేయ
రైల్వేలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు.
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు స్పందించి ముందుకు వచ్చి రైల్వే ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం పొందాలని కోరారు. ఢిల్లీలోని శ్రమ శక్తిభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత రైల్వే బడ్జెట్ రాబోయే ఐదేళ్లు దేశానికి దిశానిర్దేశం చేసేలా ఉందని అభివర్ణించారు.