నిర్భయ దోషులను ఎలా ఉరి తీస్తారో తెలుసా?

Interviewing With Talari Shared The Process Of Hanging - Sakshi

దేశాన్ని కుదిపేసి దిగ్ర్భాంతికి గురిచేసిన నిర్భయ ఘటన జరిగి  ఏడేళ్లవుతుంది. నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష ఖాయమైంది. మార్చి 20న నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషులు ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను ఉరి తీయాలంటూ కోర్టు డెత్‌వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నిర్భయ దోషులను ఎవరు ఉరి తీస్తారు? ఆ తలారి ఎవరు అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో తలారి పవన్‌ అభిప్రాయాలు తెలుసుకుందాం. (నిర్భయ: ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’)

రిపోర్టర్‌ : ఈయనే పవన్‌కుమార్‌. ధన్యవాదాలండీ.
తలారి :  ధన్యవాదాలండీ. మీరు ఈ అవకాశం కల్పించినందుకు సంతోషం.
రి  :   ఉరిశిక్ష అమలు కోసం పిలిస్తే తీహార్‌జైలుకు వెళ్తారా?
త :   హా తప్పనిసరిగా వెళ్తాను.
రి  : తీహార్‌జైలు లేదా దేశంలోని ఇతర జైళ్లతో ఉరిశిక్ష అమలుకోసం ఒక సీజన్‌ ఉంటుందని తెలుస్తోంది. జైలు మ్యానువల్‌ ప్రకారం అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణంగా ఉరిశిక్షలు అమలు చేస్తారని విన్నాం. ఉదయం 8 గంటలకు చేస్తారంట. ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? నలుగురిని ఒకేసారి ఉరితీస్తారా? లేక ఇద్దరిద్దరి చొప్పున  ఉరితీస్తారా? వేరువేరుగా చేస్తారా? వివరాలు చెప్పండి.
త :   వీలైతే నలుగురిని లేదా ఇద్దరిద్దరి చొప్పున చేస్తాం. తక్తార్‌ పెద్దదైతే, సరిపోతే ఒకేసారి చేస్తాం.

రి  :  నలుగురిని ఒకేసారి ఉరితీస్తారా?
త :   తీహార్‌లో ఉరితీసే ప్రదేశంలో ఫ్లాటుని  బట్టి ఉంటుంది. గ్యాప్‌ పెద్దదిగా ఉంటే ఒకేసారి నలుగురిని ఉరితీస్తాం.
రి  :   తీహర్‌ జైలులోని ఉరికంబం పొడవు, వెడల్పు పది అడుగులు ఉంటుందని విన్నాం. నలుగురిని ఒకేసారి ఉరితీయడానికి, నలుగురు నిలబడడానికి అది సరిపోతుందా?
త :  హా సరిపోతుంది. వీలుంటుందో లేదో చూసి చెప్పాలి.
రి  :  ఉరికోసం తాడు కట్టడానికి సమయం పడుతుందా. లేక ముందే కడతారా?
త :  ఉదయం 3 గంటలకే అక్కడికి వెళ్తాం. తాళ్లు కట్టడానికి గంట సమయం పడుతుంది. ముందురోజే ఆ ట్రయల్‌ చేస్తాం. అన్ని సరిగా ఉన్నాయో లేదో తాడు బరువు తూగుతుందో లేదో  దోషులు బలంగా ఉన్నారా? ఎన్ని ఇంచులు ఉంటుంది? ఒకేసారి చేయగలమా లేదా అని పరిశీలిస్తాం. దీన్ని బట్టి అధికారులకు చెప్తాం.

రి  :   ఉరికోసం నాలుగు తాడ్లు, గ్రేటర్‌ ఎప్పుడు తీసుకెళ్తారు? ముందురోజు రాత్రా లేక అదే రోజు ప్రొద్దున్నా?
త : పొద్దున్నే. ముందురోజు ట్రయల్‌ పూర్తయ్యాక అప్పుడు తీసుకెళ్తాం.
రి  : ఉరితీసే వారిని తీసుకొచ్చే సమయానికి తాళ్లు గ్రేటర్‌కు వేలాడుతూ ఉంటాయా? లేకుంటే  వారొచ్చాక సమయానికి తాళ్లు కడతారా?
త :  లేదు. వాటిని ఒక పక్కకు ఉంచుతారు. గ్రేటర్‌కు కట్టి ఉంచుతారు. ఉరితీసే వాళ్ల కాళ్లు కట్టేస్తాం. ముసుగు వేస్తాం. లెవల్‌ దగ్గరికి తీసుకెళ్తాం. ఎప్పుడైతే జైలర్‌ సైగ చేస్తారో అప్పుడు లీవర్‌ను  లాగుతాను.
రి  : ఉరి అమలుచేసే గదిలో పది నుంచి పన్నెండు మంది ఉంటారు. దోషుల్ని అక్కడికి తీసుకొచ్చాక ఎవరూ మాట్లాడరు. అందరూ మౌనంగా ఉంటారు. ఎందుకని?
త :  ఎందుకంటే ఎవరూ డిస్ర్టబ్‌ కా​కూడదు కదా. మర్చిపోకూడదు కదా. అందుకే మౌనంగా ఉంటాం. కేవలం సైగల ద్వారా ఆదేశాలిస్తారు. సైగల ద్వారా అన్నీ ఒకేసారి జరుగుతాయి. 

రి : జైలర్‌ మీకు ఉరి అమలుచేసేందుకు ఎలాంటి ఆదేశాలు ఇస్తారు?
త : అంటే నేను వారిని కాళ్లను కట్టేసి ఫ్లేటు మీదకు తీసుకొచ్చాక వాళ్లకు ముసుగు వేసి తాళ్లు రెడీ చేసుకొని అంతా సిద్ధం అన్నట్లుగా సైగ చేస్తాను. అప్పడు జైలర్‌ నాకు ఆదేశాలిస్తారు.
రి  :  జైలర్‌ చేతిలో రుమాలు పట్టుకొని ఉంటారా?
త : అవును అవును.
రి  : జైలర్‌ రుమాలుతో సిగ్నల్‌ ఎలా ఇస్తారు?
త : కరెక్టుగా టైం చూస్తూ జైలర్‌ తన చేతిలోని రుమాలు చూపిస్తూ ఇలా సైగ చేస్తారు. ( రుమాలును విదిలిస్తారు) అప్పుడు  వెంటనే నేను లీవర్‌ లాగేస్తాను.
రి  :  జైలర్‌ రుమాలుతో సిగ్నలిచ్చి మీరు లీవర్‌ లాగగనే ఏమవుతుంది?
త : వాళ్లు తాళ్లకు వేలాడుతారు. అంటే నలుగురు కాళ్ల కింద ప్లేటు పడిపోతుంది. వారు కింద గోతిలోకి జారిపోతారు.

రి  : కాళ్లు కట్టేస్తారు. మరి చేతులు?
త :  చేతులకి సంకెళ్లు ఉంటాయి. వెనక్కి కట్టేస్తాం. 
రి  :ఎంతసేపు వారు ఉరితాడుకు గిలగిలలాడుతారు?
త : 10-15 నిమిషాలు. ఆ తర్వాత చల్లబడిపోతారు. అర్థగంట తర్వాత వైద్యులు వాళ్ల గుండెను పరీక్షిస్తారు. సిపాయిలు మృతదేహాలను తక్టా నుంచి కిందకి దించుతారు.
రి  : అంటే ఉరితీయడానికి ముందే తలారే తాళ్లు కడతాడు. ఆ తర్వాత చనిపోయిన వారి మెడ నుంచి తాళ్లు కూడా తలారే విప్పుతారు. ఈ రెండూ మీరే చేస్తారు. అంతేనా?
త : అవును.

రి  : ఆ తర్వాత ఏం జరుగుతుంది?
త :  మా రానుపోను ఖర్చులు వగైరా ఇస్తారు. ఇంటికి వెళ్లిపోతాం.
రి : ఆ సమయంలో మీ మనసులో ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి? పదినిమిషాల ముందువరకు  మీ ముందు జీవంతో ఉన్న మనిషి . .మీరు కట్టిన తాళ్లకు వేలాడి ప్రాణాలు వదులుతాడు. డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తారు. ఈ సమయంలో మీలో ఎలాంటి భావనలు కలుగుతాయి?త:  ఏమీ ఉండదు. మీడియా వాళ్లు అడుగుతారు. వాళ్లకు సమాధానాలు చెప్తాను.
రి  :అవన్నీ అయిపోయాక మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఇదంతా చూశానన్న ఆలోచనలు ఎప్పుడైనా వస్తాయా? మీకు ఎలా అనిపిస్తుంది?
త : ఎప్పుడూ లేదు. నేనేం నేరం చేశాను? నాకెలాంటి పశ్చాత్తాపం ఉండదు. నిర్భయ లాంటి వాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. 8ఏళ్ల బాలికలను రేప్‌ చేస్తున్నారు. ఇలాంటి నేరాలకు ఉరిశిక్ష పడాల్సిందే.

రి  : ఉరితీసేటప్పడు కాళ్లు,చేతులు కట్టేస్తారు. ముఖానికి ముసుగు వేస్తారు. కానీ నోటికి ఏదీ అడ్డు పెట్టరు. కాబట్టి అతను అరవడం, కేకలు వేయడం వంటివేమైనా చేస్తాడా?
త : లేదు. మృత్యువు ఖాయం అని తెలిశాక అరిచేం లాభం?
రి  : మరణమంటే ఎవరికైనా భయమే కదా? ఉరి అములుచేసే సమయంలో ఆ భయంతో ఎవరైనా వణికిపోవడం, గాబరాపడటం చూశారా?
త : అలహాబాద్‌లో ఒకసారి ఇలానే జరిగింది. ఉరికంబం మీదకు  వెళ్లడానికి ఒకతను  నిరాకరించాడు. మొరాయించాడు. అప్పుడు పోలీసులకు చెప్పాను. వాళ్లు బలవంతంగా పట్టుకొచ్చారు. అప్పుడు ముసుగు వేశాను. జైలర్‌ సైగ చేశారు. అంతే..

రి  :  మీరు ఉరి అమలవుతున్న సమయంలో శిక్షకు గురవుతున్న వారిలో భయాందోళన, ఉద్వోగం వంటివి గమనించారా?
త :  హ. చూశాను.
రి  : ఆఖరి క్షణాల్లో ఉ‍న్నవారిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎలాంటి ఫీలింగ్స్‌ కలుగుతాయి?
త :  నాకేమీ అనిపించదు. నా డ్యూటీ నేను చేస్తున్నాను. నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను
రి  :మీ ఇంట్లో వాళ్లు ఏమంటారు? వాళ్లని ఇలా ఉరితీశాను. అలా చేశానంటూ అక్కడి విషయాలు మీ ఇంట్లో వాళ్లకి చెప్తారా?
త : హా లేదు. ఆ వివరాలు తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్తే మీరు భయపడ్తారు అని వారికి చెప్తాను. తర్వాత వాళ్లకి చెప్పినా ఏమీ అనిపించదు. నిర్భయకాండ జరిపిన వాళ్లకు ఇలానే జరగాలి అని వాళ్లంటారు.

రి  : ఈ పనికి డబ్బులు తీసుకొని మీరు ఇంటికి వెళ్తారు. ఎవరో ప్రాణాలు తీసి డబ్బులు సంపాదించాను అన్న ఫీలింగ్‌ ఎప్పుడైనా కలుగుతుందా?
త :  లేదు. లేదు. న్యాయం అమలుకోసం ఇదంతా చేస్తాం. న్యాయం అమలు చేయడానికి ఇచ్చిన డబ్బులవి. ఈపని వల్ల 125 కోట్ల మంది భారతీయులకు న్యాయం చేస్తున్నానన్న తృప్తి ఉంటుంది. అందుకు నాకు ఎలాంటి దుఃఖం ఉండదు. ఇలాంటి నేరస్తులకు ఉరిశిక్ష పడాల్సిందే. 
రి  :  సినిమాల్లో చూపించినట్లు చివరి ఘడియల్లో వాళ్లకు చెవిలో చెప్పడం లాంటివి ఉంటుందా?
త :  అలాంటిదేమీ ఉండదు.
రి  : మీరు ఉరితీసే వాళ్లను ఎప్పుడు చూస్తారు?
త : తక్టా పైన మాత్రమే వాళ్లను చూస్తాను.

రి  : ఉరిశిక్ష అమలుచేయడానికి ఉపయోగించే  ప్రత్యేకమైన తాడును బక్సర్‌ జైలు నుంచి తెస్తారు. దాన్ని మలీనా రోప్‌ అంటారు. దానికి వెన్నపూసి ఎక్కడా చిక్కు ముడులు లేకుండా చూస్తారని, క్యారమ్‌బోర్డు మీద వేసే పౌడర్‌ను దానికి రాస్తారని విన్నాం. ఇదంతా నిజమేనా?
త : హా. అలానే ఉంటుంది. 
రి  : ఒకసారి తీహార్‌ జైలులో ఉరి సందర్భంగా మెడ కట్‌ అయి రక్తం వచ్చిందంటా?
త : లేదు లేదు. అలా కాదు. చేతకాని వాళ్లు చేస్తేనే అలా అవుతుంది. ఇదే కదా మా వృత్తి.
రి  :నిర్భయ దోషుల కోసం ఎన్నిరోజులు జైళ్లో ఉంటారు? అప్పుడు మీరేం చేస్తారు?
త :   రెండు రోజులు. ఒకరోజు ట్రయల్‌ అంతే. ఎలా చేయాలి? ఏంటి? తాడు ఎలా కట్టాలి అన్నది ఆలోచిస్తాం. అధికారులతో సమావేశం అవుతాం. జైలు అధికారులు ఎలా చెప్తే అలా.

రి  :సినిమాల్లో తలారులు నల్లటి దుస్తులు వేసుకొని పొడవాటి గడ్డం, జుట్టుతో గంభీరంగా, ఒకింత భయానకంగా కనిపిస్తారు. మీరూ అలాంటి దుస్తులే వేసుకుంటారా? లేక మాములు దుస్తుల్లో వెళ్తారా?
త :  అదంతా సినిమాల్లోనే చూపిస్తారు. మేము మామాలుగానే వెళ్తాం.
రి  :  నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం మీకు లభించింది. ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
త :  ఏమీ లేదు. నిర్భయ తల్లిదండ్రులకు శాంతి కలగాలి. 125 కోట్ల ప్రజలకు శాంతి కలగాలి. అదే కోరుకుంటున్నా. అంతే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top