హాలీవుడ్‌ స్టార్‌లా రతన్‌ టాటా.. | Internet Calls Ratan Tata A Hollywood Star | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ స్టార్‌లా రతన్‌ టాటా..

Jan 23 2020 2:06 PM | Updated on Jan 23 2020 2:11 PM

 Internet Calls Ratan Tata A Hollywood Star - Sakshi

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసిన ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ముంబై : పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా ఇటీవలే ఇన్‌స్టాగ్రాంలో చేరినా తరచూ వినూత్న పోస్ట్‌లతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. సోషల్‌మీడియా మెళకువలను బాగానే ఆకళింపుచేసుకున్న రతన్‌ టాటా థ్రోబ్యాక్‌ థర్స్‌డే అంటూ చేసిన న్యూపోస్ట్‌ ఇన్‌స్టాగ్రాంను షేక్‌ చేస్తోంది. తాను యువకుడిగా లాస్‌ఏంజెల్స్‌లో ఉన్నప్పటి ఫోటోను రతన్‌ టాటా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేయడంతో నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ఆయన రతన్‌ టాటానేనా అని పోల్చుకోలేకపోవడం విశేషం.

పారిశ్రామిక దిగ్గజం ఆ ఫోటోలో హాలీవుడ్‌ హీరోలా ఉన్నారని పలువురు కామెంట్‌ చేయగా, పలువురు ఆయన సమయస్ఫూర్తినీ కొనియాడారు.రతన్‌ జీ మీ కళ్లల్లో మెరుపు కన్పిస్తోందని మరో నెటిజన్‌ మెచ్చుకున్నారు. ఇక ఫోటో పోస్ట్‌ చేస్తూ రతన్‌ టాటా ఇచ్చిన క్యాప‍్షన్‌ కూడా నెటిజన్లను ఆకట్టుకుంది. తాను లాస్‌ఏంజెల్స్‌ నుంచి భారత్‌కు వచ్చే ముందు నాటి ఈ ఫోటోను బుధవారమే పోస్ట్‌ చేయాలనుకున్నా థ్రోబ్యాక్‌ థర్స్‌డే గురించి విని ఇప్పుడు పోస్ట్‌ చేశానని రతన్‌ టాటా క్యాప్షన్‌లో ప్రస్తావించారు.

చదవండి : ‘మోదీ, షా’ విజన్ ఎంతో గొప్పది : రతన్‌ టాటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement