15కేజీల బ్యాగేజీ దాటితే వాతే!

IndiGo, SpiceJet, GoAir hike excess baggage charges for domestic flyers - Sakshi

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులపై ప్రైవేటు విమాన సంస్థలు భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇకపై ప్రయాణికుల బ్యాగేజీ 15 కేజీలు దాటితే.. అదనపు లగేజీకి వాతలు తప్పవు. ఇండిగో, గో ఎయిర్, స్పైస్‌ జెట్‌లు ఈ 15 కేజీల నిబంధనను తీసుకొచ్చాయి. పరిమితి తర్వాత ఒక్కో కేజీకి రూ.400 రూపాయలు వసూలు చేయనున్నారు. గో ఎయిర్‌లో శని వారం నుంచే ఈ వడ్డింపు అమల్లోకి రాగా.. ఇండిగో, స్పైస్‌ జెట్‌లలో వచ్చే శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఒకవేళ ముందుగానే బుక్‌ చేసుకున్నట్లయితే.. 5 కేజీలకు రూ.1,900, 10 కేజీలకు రూ. 3,800లు వసూలు చేస్తామని గో ఎయిర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఇండిగో, స్పైస్‌జెట్‌లలోనూ కాస్త అటు, ఇటుగా ఇదే వడ్డింపు ఉంటుంది. గత నెల్లో, జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా కొత్త బ్యాగేజీ నిబంధనలను (వచ్చే నెల నుంచి అమల్లోకి) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా మాత్రమే తమ ప్రయాణికులకు 25 కేజీల వరకు బ్యాగేజీ అనుమతినిస్తోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top