రైలు టికెట్‌ను బదిలీ చేసుకోవచ్చు | Indian Railways passengers can now transfer their train ticket to someone else | Sakshi
Sakshi News home page

రైలు టికెట్‌ను బదిలీ చేసుకోవచ్చు

Mar 10 2018 3:22 AM | Updated on Mar 10 2018 10:49 AM

Indian Railways passengers can now transfer their train ticket to someone else - Sakshi

న్యూఢిల్లీ: రైలు టికెట్‌ బుక్‌ చేసుకుని చివరి నిమిషంలో రద్ దుచేసుకునే కష్టాలు ఇకపై ఉండబోవు. ఇకపై ఆ టికెట్‌ను రద్దుచేసుకునే అవసరం లేకుండా తెలిసిన వారికి లేదా బంధువులకు బదిలీచేయొచ్చు. అయితే ఇందుకోసం రైల్వే శాఖ అనుమతి తప్పనిసరి. ఈ సేవను వినియోగించుకోవాలంటే మీ టికెట్‌ కన్ఫర్మ్‌ అయి ఉండాలి.

టికెట్‌ బదిలీ చేసుకునేందుకు అనుమతిచ్చే అధికారం ముఖ్యమైన స్టేషన్లలోని చీఫ్‌ రిజర్వేషన్‌ పర్యవేక్షకులకు కల్పించారు. రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకునే టికెట్‌ను బదిలీ చేయాలి. ఇక విద్యార్థులు టికెట్‌ను బదిలీ చేయాలనుకుంటే మాత్రం వారు చదివే విద్యా సంస్థ ప్రిన్సిపల్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒక టికెట్‌ను ఒకసారి మత్రమే బదిలీ చేయాలి.  

Advertisement
 
Advertisement
Advertisement