లాక్‌ డౌన్‌: 58 రూట్లలో 109 పార్సిల్‌ రైళ్లు | Indian Railways Introduces 109 Parcel Trains over 58 Routes | Sakshi
Sakshi News home page

58 రూట్లలో 109 పార్సిల్‌ రైళ్లు

Apr 9 2020 7:40 AM | Updated on Apr 9 2020 7:40 AM

Indian Railways Introduces 109 Parcel Trains over 58 Routes - Sakshi

లాక్‌ డౌన్‌ వేళ దేశమంతటా అత్యవసరాలను రవాణా చేసేందుకు రైల్వే శాఖ టైమ్‌ టేబుల్‌ పార్సిల్‌ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.

న్యూఢిల్లీ: లాక్‌ డౌన్‌ వేళ దేశమంతటా అత్యవసరాలను రవాణా చేసేందుకు రైల్వే శాఖ టైమ్‌ టేబుల్‌ పార్సిల్‌ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా పలు నగరాలకు వీటి ద్వారా సరుకులను రవాణా చేయవచ్చని తెలిపింది. లాక్‌ డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి మొత్తం 58 రూట్లలో 109 రైళ్లను ప్రకటించినట్లు చెప్పింది. ఏప్రిల్‌ 5 వరకూ 27 రూట్లు నోటిఫై చేయగా, అందులో 17 రూట్లు ఇప్పటికే సర్వీసులు నడుస్తు న్నాయి. మిగిలిన రూట్లలో సింగిల్‌ ట్రిప్‌లు మాత్రమే జరుగుతున్నాయి. ప్రస్తుతం మరో 40 రూట్లను వీటికి జత చేయనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు రవాణా జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రత్యేకించి నిత్యావసరాలు, అత్యవసర పరిశ్రమలకు సంబంధించిన సరుకు, వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయవచ్చని తెలిపింది.

(చదవండి: ‘సోషల్‌ ఎమర్జెన్సీ’ తరహా పరిస్థితి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement