రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్ | Indian Railways Employees get 78-day bonus before the Dussehra festival | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగులకు తీపి కబురు

Sep 28 2016 2:46 PM | Updated on Sep 4 2017 3:24 PM

రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్

రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్

రైల్వే ఉద్యోగులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.  ప్రతి ఏడాది ఇచ్చేవిధంగా ఈసారి కూడా 78 రోజల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారమిక్కడ తెలిపారు.

రైల్వే ఉద్యోగులకు ప్రతిఏటా దసరా పండుగకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి కూడా ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) పేరుతో 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించటం జరిగింది.  కేబినెట్ తాజా నిర్ణయంతో దాదాపు 13 లక్షల ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. బోనస్ నిర్ణయంతో రైల్వేపై రూ.2,000 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. 2011-12, 2012-13, 2013-14, 2014-2015 సంవత్సరాల్లోనూ రైల్వే శాఖ 78 రోజుల బోనస్‌నే ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement