రైల్వే ఫిర్యాదుల కోసం మదద్‌ యాప్‌

Indian Railways dedicated app for lodging complaints coming - Sakshi

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు తమ సమస్యలను ఫిర్యాదు చేసేందుకుగాను మదద్‌ అనే మొబైల్‌ యాప్‌ను రైల్వే శాఖ రూపొందించింది. ఈ యాప్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. ప్రయాణ సమయంలో ఎదురయ్యే సమస్యల్ని ఇప్పటివరకు ట్వీటర్, ఫేస్‌బుక్‌ గ్రీవియెన్స్‌ సెల్‌లోనే ఫిర్యాదు చేసే అవకాశముంది. త్వరలో అందుబాటులోకి రానున్న మదద్‌ యాప్‌ద్వారా రైళ్లలోని ఆహార నాణ్యత, పారిశుధ్యం వంటి వాటిపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీంతోపాటుగా అత్యవసర సేవల్ని కూడా పొందవచ్చు. ఇచ్చిన ఫిర్యాదుపై ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునే అవకాశముంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top