బ్రహ్మోస్‌ సక్సెస్‌

India successfully test-fires BrahMos supersonic cruise missile - Sakshi

బాలాసోర్‌ (ఒడిశా): ప్రపంచంలోనే అత్యంత వేగమైన బ్రహ్మోస్‌ సూపర్‌ క్రూయిజ్‌ క్షిపణిని భారత శాస్త్రవేత్తలు సోమవారం విజయ వంతం గా ప్రయోగించారు. ఒడిశా తీరంలోని చాం దీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ లాంచ్‌ ప్యాడ్‌ 3లోని మొబైల్‌ లాంచర్‌ ద్వారా ఉదయం 10.40 గంటలకు క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు డీఆర్‌ డీవో వెల్లడించింది. బ్రహ్మోస్‌ జీవిత కాలాన్ని పొడిగించేందుకుగాను తాజా ప్రయోగాన్ని చేపట్టినట్లు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. ఈ ప్రయోగానికి సంబంధించిన సాంకేతికతను డీఆర్‌డీవో, బ్రహ్మోస్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా తొలిసారి భారత్‌లో అభివృద్ధి చేశారు. ప్రస్తుత ప్రయోగంతో ఇండియన్‌ ఆర్మీకి మిస్సైల్స్‌ కోసం చేయాల్సిన ఖర్చు భారీగా తగ్గనుంది. మిస్సైల్‌ వినియోగ కాలాన్ని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతూ దీని సాంకేతికతలో మార్పులు చేశా రు. జీవిత కాలాన్ని పొడిగించిన భారతదేశ మొ దటి క్షిపణి బ్రహ్మోస్‌ కావడం గమనార్హం. భూ మిపై నుంచి ఆర్మీ, నీటిలో నుంచి నౌకాదళం, ఆకాశం నుంచి వాయుసేన.. ఇలా త్రివిధ దళా ల్లో ఎక్కడి నుంచైనా ప్రయోగించడానికి అనువు గా ఉండే సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిగా బ్రహ్మోస్‌ దేశ భద్రతకు సేవలందిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top