breaking news
experiment Success
-
క్షిపణి నిరోధక వ్యవస్థ ప్రయోగం సక్సెస్
బాలాసోర్: గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. శత్రుదేశాలు బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగిస్తే గాల్లోనే పేల్చివేయగల రెండంచెల క్షిపణి నిరోధక వ్యవస్థను ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ఐలాండ్‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత ఓ క్షిపణిని నిర్దేశిత లక్ష్యంపైకి ప్రయోగించారు. రాడార్లు అప్రమత్తం చేయడంతో అప్పటికే సిద్ధంగా ఉన్న పృథ్వీ డిఫెన్స్ వెహికల్(పీడీవీ) దీన్ని నిలువరించేందుకు గాల్లోకి దూసుకెళ్లింది. అనంతరం భూమికి 50 కి.మీ ఎత్తులో క్షిపణిని పృథ్వీ నాశనం చేసింది. -
బ్రహ్మోస్ సక్సెస్
బాలాసోర్ (ఒడిశా): ప్రపంచంలోనే అత్యంత వేగమైన బ్రహ్మోస్ సూపర్ క్రూయిజ్ క్షిపణిని భారత శాస్త్రవేత్తలు సోమవారం విజయ వంతం గా ప్రయోగించారు. ఒడిశా తీరంలోని చాం దీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లాంచ్ ప్యాడ్ 3లోని మొబైల్ లాంచర్ ద్వారా ఉదయం 10.40 గంటలకు క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు డీఆర్ డీవో వెల్లడించింది. బ్రహ్మోస్ జీవిత కాలాన్ని పొడిగించేందుకుగాను తాజా ప్రయోగాన్ని చేపట్టినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు. ఈ ప్రయోగానికి సంబంధించిన సాంకేతికతను డీఆర్డీవో, బ్రహ్మోస్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా తొలిసారి భారత్‌లో అభివృద్ధి చేశారు. ప్రస్తుత ప్రయోగంతో ఇండియన్ ఆర్మీకి మిస్సైల్స్ కోసం చేయాల్సిన ఖర్చు భారీగా తగ్గనుంది. మిస్సైల్ వినియోగ కాలాన్ని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతూ దీని సాంకేతికతలో మార్పులు చేశా రు. జీవిత కాలాన్ని పొడిగించిన భారతదేశ మొ దటి క్షిపణి బ్రహ్మోస్ కావడం గమనార్హం. భూ మిపై నుంచి ఆర్మీ, నీటిలో నుంచి నౌకాదళం, ఆకాశం నుంచి వాయుసేన.. ఇలా త్రివిధ దళా ల్లో ఎక్కడి నుంచైనా ప్రయోగించడానికి అనువు గా ఉండే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా బ్రహ్మోస్ దేశ భద్రతకు సేవలందిస్తోంది. -
గ‘ఘన’ విజయం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతర్జాతీయ ఉపగ్రహ ప్రయోగ యవనికపై భారత్ (ఇస్రో) మరోసారి కీర్తిపతాకాన్ని ఎగరేసింది. భారత సమాచార వ్యవస్థకు పదునుపెట్టే జీశాట్6–ఏ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ప్రయోగవేదిక నుంచి జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్08) ఉపగ్రహ వాహకనౌక 2,140 కిలోలు బరువు కలిగిన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయంతో క్రయోజనిక్ దశ ద్వారా చేసిన ప్రయోగాల్లో వరుసగా ఆరోవిజయాన్ని (డబుల్ హ్యాట్రిక్) ఇస్రో నమోదు చేసింది. బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవగా 27 గంటల కౌంట్‌డౌన్ అనంతరం గురువారం సాయంత్రం 4.56 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్ఎల్వీ సిరీస్‌లో చేసిన 12 ప్రయోగాల్లో ఇది తొమ్మిదో విజయం. షార్‌నుంచి 63వ ప్రయోగం కావటం గమనార్హం. ఈ ప్రయోగంలో అత్యంత కీలకంగా మారిన క్రయోజనిక్ మూడో దశను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడంలో ఇస్రో శాస్త్రవేత్తలు పరిణితి సాధించారు. డాక్టర్ శివన్ ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి ప్రయోగం కావటంతో.. ఆయనలో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. ప్రయోగం జరిగిందిలా.. 49.1 మీటర్ల పొడవున్న జీఎస్ఎల్వీ ఎఫ్08 నిప్పులు చిమ్ముకుంటూ నింగికి పయనమైంది. 4 స్ట్రాపాన్ బూస్టర్లు, కోర్ అలోన్ దశల సాయంతో మొదటిదశ ప్రారంభమైంది. ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 42.7 టన్నుల ద్రవ ఇంధనం లెక్కన నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో 170.8 టన్నుల ద్రవ ఇంధనంతో పాటు కోర్ అలోన్దశలో 138.11 ఘన ఇంధనంతో మొదటిదశను 151 సెకన్లలో విజయవంతంగా పూర్తి చేశారు. 39.48 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో రెండోదశను 285 సెకన్లలో, ఆ తరువాత క్రయోజనిక్ దశను 12.84 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1,065 సెకన్లలో పూర్తి చేశారు. అక్కడ నుంచి ఉపగ్రహాన్ని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ వారు వారి అధీనంలోకి తీసుకుని కక్ష్యలో ఉపగ్రహం పరిస్థితిని నియంత్రిస్తున్నారు. సమష్టి విజయం ప్రయోగం విజయవంతం శాస్త్రవేత్తల సమష్టి విజయమని ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ తెలిపారు. క్రయోజనిక్ దశను రూపొందించడంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో ఇక భారీ ప్రయోగాలు సైతం చేయగలమన్న విశ్వాసం పెరిగిందన్నారు. వాణిజ్యపరంగా కూడా భవిష్యత్తులో మరెన్నో ప్రయోగాలు చేపడతామని శివన్ తెలిపారు. ఇప్పటిదాకా చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే ఇకనుంచి అన్ని భారీ ప్రయోగాలే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని, ఈ ఏడాది రాబోవు తొమ్మిది నెలల్లో 10 ప్రయోగాలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని శివన్ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో చంద్రయాన్–2 ప్రయోగాన్ని జీఎస్ఎల్వీ మార్క్–3డీ2 ద్వారా చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రపతి, ప్రధాని, కేసీఆర్ అభినందనలు ఇస్రో ఘనవిజయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత్ సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్న ఇస్రో తీరు గర్వకారణం. స్వదేశీ క్రయోజనిక్ దశ ద్వారా విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. జీశాట్–6ఏ సమాచార ఉపగ్రహం ద్వారా మరిన్ని అధునాతన మొబైల్ యాప్‌లను సృష్టించేందుకు అవకాశం కలుగుతుంది’ అని ప్రధాని ట్వీట్‌చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జీశాట్–6ఏ విజయవంతం కావటంపై శాస్త్రవేత్తలను అభినందించారు. దేశ ఖ్యాతి పెంచారు: వైఎస్ జగన్ సమాచార రంగంలో భారత ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. భారత పేరు ప్రతిష్టలు పెంచే ఈ క్రతువులో భాగస్వాములైన ఇస్రో శాస్త్రవేత్తలకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఉపగ్రహంతో ప్రయోజనం జీశాట్–6ఏ సమాచార ఉపగ్రహ ప్రయోగంతో డిజిటల్ మల్టీ మీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. జీశాట్ 6ఏ ఉపగ్రహంలో 5ఎస్‌బ్యాండ్ స్పాట్ బీమ్స్, ఒక సీబ్యాండ్ బీమ్ అమర్చి పంపించారు. ఆరు చదరపు మీటర్లు వ్యాసార్థం కలిగిన అన్‌ఫర్‌లేబిల్ యాంటెన్నాతో యూజర్ కమ్యూనికేషన్ లింక్, 0.8 చదరపు మీటర్లు ఫిక్స్డ్ యాంటెన్నా ద్వారా హబ్ కమ్యూనికేషన్ లింక్ అందుబాబులోకి వస్తుంది. ఇందులోని ఒక బీమ్.. రక్షణరంగం, విమానయానం, అంతరిక్ష రంగాలకు అత్యంత అధునాతనమైన శాటిలైట్ ఫోన్ల టెక్నాలజీని అందిస్తుంది. మరో బీమ్ ద్వారా డిజిటల్ మల్టీమీడియా రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తుంది. మొబైల్ ఫోన్లలో సురక్షితమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. భారీ యాంటెన్నా భారతదేశమంతా పూర్తిస్థాయిలో విస్తరిస్తూ అయిదు పుంజాలతో పనిచేస్తుంది. -
ఇన్శాట్-3డీఆర్ ప్రయోగం సక్సెస్
జాతీయం కేంద్రం, నాబార్డ్, ఎన్‌డబ్ల్యూడీఏ మధ్య కీలక ఒప్పందం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులకు సంబంధించి సెప్టెంబర్ 6న కేంద్ర జల వనరుల శాఖ, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్), జాతీయ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై)లో భాగంగా నాబార్డ్ నిధులతో దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 (గుర్తించిన) సాగునీటి ప్రాజెక్టులను 2019-20 లోపు పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కొత్తగా 76.03 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడుకు కావేరి జలాలు విడుదల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 6న కర్నాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేసింది. కృష్ణరాజసాగర్ రిజర్వాయర్ (కేఆర్ఎస్), హారంగి, కబిని, హేమావతి డ్యామ్‌ల నుంచి రోజుకు 12,000 క్యూసెక్కుల చొప్పున పది రోజులపాటు కావేరీ జలాలను విడుదల చేస్తోంది. గ్రామీణ పారిశుధ్యంలో అగ్ర భాగాన సిక్కిం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులపై నిర్వహించిన జాతీయ శాంపిల్ సర్వే లో స్వచ్ఛ రాష్ట్రంగా సిక్కిం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ న్యూఢిల్లీలో సెప్టెంబర్ 8న సర్వే నివేదికను విడుదల చేశారు. ఇందులో 98.2 శాతంతో సిక్కిం మొదటి స్థానాన్ని దక్కించుకోగా, జార్ఖండ్ చివరి స్థానంలో నిలిచింది. గుజరాత్ 14వ స్థానంలో, ఏపీ 16వ స్థానంలో నిలిచాయి. 2015 మే-జూన్ మధ్య 26 రాష్ట్రాల్లోని 3,788 గ్రామాలు, 73,716 నివాసాల్లో సర్వే నిర్వహించారు. మరుగుదొడ్లను కలిగి ఉన్న ఇండ్ల శాతం, వాటి వినియోగం ఆధారంగా ఈ ర్యాంకులను ఖరారు చేశారు. కేంద్ర తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ పారిశుధ్య పరిస్థితిపై సేకరించిన వివరాలతో క్రోడీకరించిన నివేదికలోనూ సిక్కిం (99.1 శాతం) అగ్రస్థానంలో నిలవగా, బిహార్ చివరి స్థానంలో ఉంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లలో మరుగుదొడ్లు కలిగి వాడుతున్న వారి శాతం 42.13గా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ.. నివేదికలో పేర్కొంది. తొలి ద్వీప ప్రాంత జిల్లాగా మజులీ దేశంలో తొలి ద్వీప ప్రాంత జిల్లాగా అసోంలోని మజులీ ఏర్పడింది. ఈ మేరకు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ సెప్టెంబర్ 8న ప్రకటన చేశారు. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న మజులీ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. దీని విస్తీర్ణం 1250 చ.కి.మీ. మజులీ అసోంలో 35వ జిల్లా. అంతర్జాతీయం ఆసియాన్ సదస్సు ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్-ఆసియాన్) సదస్సు సెప్టెంబర్ 6-8 తేదీల్లో లావోస్‌లోని వియంటైన్లో జరిగింది. ఈ సదస్సును ‘టర్నింగ్ విజన్ ఇన్‌టూ రియాలిటీ ఫర్ ఎ డైనమిక్ ఆసియాన్ కమ్యూనిటీ’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. సదస్సులో ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2025 అమలుపై ఆసియాన్ వెలుపలి భాగస్వాములతో సహకారాన్ని విస్తరించుకోవడంపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ‘వన్ ఆసియాన్, వన్ రెస్పాన్స్’ అనే ఆసియాన్ డిక్లరేషన్‌పై నేతలు సంతకాలు చేశారు. ఈ ప్రాంతంతోపాటు వెలుపలి ప్రాంతంలో సంభవించే విపత్తులపై ఆసియాన్ ఒకటిగా స్పందించాలని నిర్ణయించారు. ఆసియాన్-భారత్ సదస్సు ఆసియాన్ సదస్సులో భాగంగా సెప్టెంబర్ 8న 14వ ఆసియాన్-భారత్ సదస్సు జరిగింది. ఇందులో భారత ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విదేశీ ఉగ్రవాదం పెరిగిపోతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఆసియాన్ సభ్యదేశాలు సమన్వయంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. తూర్పు ఆసియా సదస్సు తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 8న లావోస్‌లోని వియంటైన్లో జరిగింది. జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అణు భద్రతకు చర్యలు తీసుకోవాలని సదస్సు తీర్మానించింది. ఈ సందర్భంగా 18 దేశాలు అణు నిరాయుధీకరణ, అణు సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి నిరోధానికి మద్దతు పలికాయి. ఈ సమావేశంలో 10 ఆసియాన్ దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు పాల్గొన్నాయి. 2005లో తూర్పు ఆసియా శిఖరాగ్ర వేదిక ఏర్పాటు చేసిన నాటి నుంచి భారత్ అందులో సభ్యురాలిగా ఉంది. పారిస్ ఒప్పందాన్ని ఆమోదించిన అమెరికా, చైనా పారిస్ వాతావరణ మార్పు ఒప్పందానికి అమెరికా, చైనాలు అమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన ఆమోద పత్రాలను సెప్టెంబర్ 3న చైనాలోని హాంగ్జౌలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌కు అందించాయి. పారిస్ ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి రావాల్సి ఉంది. దీని కోసం ఒప్పందానికి అంగీకరించిన 195 దేశాల్లో కనీసం 55 దేశాలు ఆమోదించాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్శాట్-3డీఆర్ ప్రయోగం సక్సెస్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సెప్టెంబర్ 8న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి చేపట్టిన ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. వాతావరణ అధ్యయనానికి ఉద్దేశించిన ఈ ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ)-ఎఫ్05 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇన్శాట్-3డీఆర్: పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఆధునిక ఉపగ్రహం. ఇది వాతావరణ శాస్త్ర అధ్యయనంతోపాటు మరింత కచ్చితత్వంతో పరిశోధన చేస్తుంది. సముద్ర గాలి దిశలను గమనించి వాతావరణ పరిశోధనలకు చేయూతనందిస్తుంది. ఈ ప్రయోగంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్ అప్పర్ స్టేజ్‌ని వినియోగించారు. దీంతో తొలిసారి పూర్తిస్థాయి స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ ఉపయోగించినట్లయింది. అణు పరీక్ష నిర్వహించిన ఉత్తర కొరియా ఉత్తర కొరియా అణు పరీక్షలను (ఐదో) విజయవంతంగా నిర్వహించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సెప్టెంబర్ 8న వెల్లడించింది. ఉత్తర కొరియా న్యూక్లియర్ పరీక్ష జరిపిన ప్రాంతంలో 5.3 తీవ్రతతో సంభవించిన భూకంపాన్ని అణు పరీక్షలుగా ప్రపంచ దేశాలు అనుమానించిన నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ ప్రకటన చేసింది. ఆర్థికం జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాజ్యాంగ సవరణ(122) బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ చట్టం 2017, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ప్రభుత్వం జీఎస్టీ మండలిని ఏర్పాటు చేయనుంది. పన్నురేటు, సెస్, సర్ఛార్జీలు వంటివాటిని ఈ మండలి నిర్ణయిస్తుంది. జీఎస్టీ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రాల ఆమోదానికి పంపారు. ఈ క్రమంలో 17 రాష్ట్రాలు బిల్లును ఆమోదించాయి. వార్తల్లో వ్యక్తులు అరుణాచల్ గవర్నర్ రాజ్‌ఖోవా తొలగింపు అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవాను సెప్టెంబర్ 12న పదవి నుంచి తొలగించారు. కేంద్రం రాజ్‌ఖోవాను ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేయాల్సిందిగా కోరింది. అయితే దానికి ఆయన నిరాకరించారు. దీంతో ఆయన్ను తొలగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. క్రీడలు రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం, కాంస్యం రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. పురుషుల హైజంప్ టీ-42 విభాగంలో మరియప్పన్ తంగవేలు 1.89 మీటర్లు జంప్ చేసి స్వర్ణ పతకం, వరుణ్‌సింగ్ భాటి 1.86 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం సాధించారు. పారాలింపిక్స్‌లో దీపా మాలిక్‌కు రజతం రియో పారాలింపిక్స్‌లో మహిళల షాట్‌పుట్(ఎఫ్-53)లో సెప్టెంబర్ 12న భారత క్రీడాకారిణి దీపా మాలిక్ రజత పతకాన్ని సాధించింది. దీంతో పారాలింపిక్స్ లో భారత్‌కు పతకం అందించిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 6 రెడ్ చాంపియన్‌షిప్‌లో అద్వానీకి కాంస్యం భారత్‌కు చెందిన పంకజ్ అద్వానీ ప్రతిష్టాత్మక 6 రెడ్ స్నూకర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. వావ్రింకా, కెర్బర్లకు యూఎస్ ఓపెన్ టైటిల్స్ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను వావ్రింకా (స్విట్జర్లాండ్) గెలుచుకున్నాడు. న్యూయార్క్‌లో సెప్టెంబర్ 12న జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ (సెర్బియా)ను ఓడించి తొలిసారి ఈ టైటిల్ సాధించాడు. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) గెలుచుకుంది. ఫైనల్లో కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను జమీ ముర్రే (గ్రేట్ బ్రిటన్), బ్రూనో సోరెస్ (బ్రెజిల్); మహిళల డబుల్స్ టైటిల్‌ను బెథాన్ మాటెక్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్); మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను లారా సీజ్ మండ్ (జర్మనీ), మేట్ పావిచ్(క్రొయేషియా) దక్కించుకున్నారు. ఇండియన్ రైల్వేస్‌కు మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టైటిల్ 90వ ఆల్ ఇండియా ఎంిసీసీ-మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను సెప్టెంబర్ 11 ఇండియన్ రైల్వేస్ గెలుచుకుంది.