హీరో విజయ్‌కి షాకిచ్చిన ఐటీ అధికారులు | Income Tax Raids At Vijay House | Sakshi
Sakshi News home page

హీరో విజయ్‌ ఇంట్లో మళ్లీ ఐటీ సోదాలు

Mar 12 2020 1:25 PM | Updated on Mar 12 2020 1:48 PM

Income Tax Raids At Vijay House - Sakshi

సాక్షి, చెన్నై : తమిళ హీరో విజయ్‌కి ఆదాయపన్ను శాఖ అధికారులు మరోసారి షాకిచ్చారు. గురువారం  చెన్నైలోని విజయ్‌ నివాసంలో ఐటీ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. గత నెలలోనూ విజయ్‌ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత దాడులకు కొనసాగింపుగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. 
(చదవండి : విజయ్‌ రాజకీయాల్లోకి రావడం తథ్యం )

గత నెలలో విజయ్‌ ఇంటిపై, ఆఫీసుపై ఏకకాలంలో దాడులు చేసిన ఐటీ అధికారులు.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వారి దాడిలో ఆదాయానికి సంబంధించిన లెక్కలన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని తెలిసింది. దీంతో విజయ్‌తో పాటు, సినీ వర్గాలు, ముఖ్యంగా ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజగా ఐటీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం విజయ్ మాస్టర్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా ఆడియో ఈనెల 15 వ తేదీన రిలీజ్ కాబోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement