ట్వీటర్‌లో ప్రధాని మోదీ, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ చెరో కొత్త రికార్డు సృష్టించారు.
న్యూఢిల్లీ: ట్వీటర్‌లో ప్రధాని మోదీ, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ చెరో కొత్త రికార్డు సృష్టించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత మోదీ చేసిన ట్వీట్‌ను దేశంలో అత్యధికంగా 70,515 మంది షేర్ చేశారు. ‘భారత్ గెలిచింది. భారత్‌కు విజయం.
ఇక మంచి రోజులు రాబోతున్నాయి’ అంటూ మోదీ చేసిన ట్వీట్‌కు దేశంలో అత్యధిక రీట్వీట్లు దక్కాయి. ట్వీటర్‌లో దేశంలో అత్యధిక మంది అనుసరిస్తున్న ప్రముఖుడిగా అమితాబ్ రికార్డు సృష్టించారు. దేశంలోఆయనకు మొత్తం 1.18 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.