భారీస్ధాయిలో అధికారుల బదిలీ | Ias Officers Transfered In Up | Sakshi
Sakshi News home page

ఉత్తర ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున అధికారుల బదిలీ

Feb 17 2019 10:14 AM | Updated on Feb 17 2019 10:19 AM

Ias Officers Transfered In Up - Sakshi

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యూపీలో భారీగా అధికారుల బదిలీలు

లక్నో : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున అధికారుల బదిలీలు చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో పలువురు ఉన్నతాధికారులకు స్ధానచలనం కలిగింది. 22 జిల్లాల మేజిస్ట్రేట్‌లతో పాటు 64 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. పలు డివిజనల్‌ కమిషనర్లు, ప్రభుత్వ కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులనూ ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఫిబ్రవరి 20 తర్వాత ఎలాంటి బదిలీలు చేపట్టరాదన్న ఈసీ ఆదేశాలతో యూపీ ప్రభుత్వం కీలక సార్వత్రిక ఎన్నికల ముందు భారీగా అధికారుల బదిలీలపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

మరోవైపు 107 మంది సీనియర్‌ ప్రొవిజనల్‌ సివిల్‌ సర్వీస్‌ (పీసీఎస్‌) అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం యూపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్‌ డివిజనల్‌, సిటీ మేజిస్ర్టేట్‌ స్ధాయి అధికారులను పెద్దసంఖ్యలో బదిలీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement