'ఇందిర కోడలిని.. ఎవరికీ భయపడను' | iam Indira gandhi's daughter in law, not scared of anyone, says sonia gandhi | Sakshi
Sakshi News home page

'ఇందిర కోడలిని.. ఎవరికీ భయపడను'

Dec 8 2015 11:23 AM | Updated on Mar 18 2019 9:02 PM

'ఇందిర కోడలిని.. ఎవరికీ భయపడను' - Sakshi

'ఇందిర కోడలిని.. ఎవరికీ భయపడను'

'దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కోడలిని.. ఎవరికీ భయపడను' అని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు.

న్యూఢిల్లీ: 'దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కోడలిని.. ఎవరికీ భయపడను' అని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సోనియా పైవిధంగా స్పందించారు.

నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులు దుర్వినియోగం చేశారంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్మామి దాఖలు చేసిన కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కి సమన్లు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరూ మంగళవారం పాటియాల కోర్టుకు హాజరుకావాల్సిఉండగా, ఇద్దరూ గైర్హాజరయ్యారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని సోనియా ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement