ప్రేయసిపై అనుమానం.. పళ్లు ఊడకొట్టాడు

Husband Forces Woman To Remove 2 Teeth To Look Ugly - Sakshi

అహ్మదాబాద్‌ : వివాహం అయ్యి, పిల్లలు పుట్టాక మరోక వ్యక్తిని ప్రేమించింది గీతాబేన్‌. అతనికి కూడా వివాహం అయ్యింది, పిల్లలున్నారు. అయినా కూడా వారిద్దరు తమ మొదటి జీవిత భాగస్వాములని, పిల్లలను వదిలి వచ్చి, సహజీవనం చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు పదిహేనేళ్లు అవుతోంది. ఇంతకాలం బానే వుండేవాడు కానీ ఇప్పుడు తనపై అనుమానం పెంచుకుని హింసిస్తున్నాడని తెలిపింది. ‘ఇన్నాళ్లు సంతోషంగానే ఉన్నాను. కానీ ఒక ఏడాది నుంచి నా జీవితం నరకంగా మారిందం’టూ విలపిస్తోంది గీతాబేన్‌.

వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కు చెందిన గీతాబేన్‌(55) పెళ్లైన తర్వాత పదిహేనేళ్ల క్రితం మరో వ్యక్తిని ప్రేమించింది. అతని కోసం భర్త, పిల్లలను వదిలి పెట్టి వచ్చి మరి ఆ వ్యక్తితో జీవిస్తోంది. అతను(57) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూంటాడని తెలిపింది. ఇన్నాళ్లు అతను నన్నుబాగానే చూసుకున్నాడని, కానీ గత ఏడాది నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని, నరకం చూపిస్తున్నాడని వివరించింది.

‘ఒక ఏడాది నుంచి నా భాగస్వామి నన్ను అనుమానించడం ప్రారంభించాడు. నన్ను పనికి పంపించడం మానేశాడు. అప్పటి నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను. అయినా అతనికి అనుమానం తగ్గలేదు. బయట నుంచి ఎవరైనా నన్ను చూస్తున్నారేమోనని కిటికిలను ప్లాస్టిక్‌ షీట్‌తో కప్పేశాడు. అనుక్షణం నన్ను అనుమానిస్తూండేవాడు.

చివరకు ఆ పిచ్చి ఎంత దాకా చేరిందంటే నన్ను అందవికారంగా మార్చడం కోసం నా ముందు పళ్లు రెండు ఊడగొట్టాడు. ఇప్పుడు ఇంట్లో కూడా ఉంచకుండా తనతో పాటే ఆటోలో నన్నూ తీసుకెళ్తున్నాడు. ఇంకా అతన్ని భరించడం నా వల్ల కాలేదు. అందుకే ఆటోలో నుంచి దూకి పారిపోయి వచ్చాను’ అంటూ పోలీసులకు వివరించింది. ప్రస్తుతం పోలీసులు గీతాబేన్‌ ప్రేమించిన వ్యక్తిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు. ఆమెకు ఎటువంటి హానీ తలపెట్టనని రాత పూర్వక హామీ ఇస్తేనే గీతాబేన్‌ను అతనితో పంపిస్తామని తెలిపారు..

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top