భార్య అందంగా ఉందని యాసిడ్‌ పోసిన భర్త | Husband acid Attack on Wife at Bangalore | Sakshi
Sakshi News home page

భార్య అందంగా ఉందని యాసిడ్‌ పోసిన భర్త

Jul 16 2017 3:47 AM | Updated on Aug 17 2018 2:10 PM

భార్య అందంగా ఉందని యాసిడ్‌ పోసిన భర్త - Sakshi

భార్య అందంగా ఉందని యాసిడ్‌ పోసిన భర్త

భార్యపై అనుమానంతో ఒక భర్త యాసిడ్‌ దాడికి పాల్పడ్డ కిరాతక ఘటన బెంగళూరు కేజీ నగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

- బెంగళూరులో దాష్టీకం
బాధితురాలికి రూ.3 లక్షలు అందించిన మహిళా కమిషన్‌
 
బనశంకరి (బెంగళూరు): భార్యపై అనుమానంతో ఒక భర్త యాసిడ్‌ దాడికి పాల్పడ్డ కిరాతక ఘటన బెంగళూరు కేజీ నగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నేగౌడ, మంజుల దంపతులు స్థానికంగా నివాసముంటున్నారు. మంజుల గార్మెంట్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు తోటి ఉద్యోగితో వివాహేతర సంబంధం ఉందని భర్త నిత్యం వేధించేవాడు. దీంతో మంజుల 4 రోజుల క్రితం గార్మెంట్స్‌లో ఉద్యోగాన్ని కూడా మానేసింది. తన భార్య అందంగా ఉండటంతో అందరూ తన భార్యను చూస్తున్నారని, ఆమెను కురూపి చేయాలనే దుర్బుద్ధితో శుక్రవారం ఆమెపై యాసిడ్‌ గుమ్మరించాడు.

గాయాలపాలైన ఆమెను తక్షణం స్థానికులు వెంటనే బాధితురాలిని విక్టోరియా ఆసుపత్రికి తరలించగా, స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మంజులకు 50 శాతం కాలిన గాయాలు అయ్యాయని, ఆమె ఎడమకన్ను పూర్తిగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. బాధితురాలు మంజులను రాష్ట్ర మహిళాకమిషన్‌ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి శనివారం ఆస్పత్రిలో పరామర్శించి ఓదార్చారు. మహిళా కమిషన్‌ తరఫున రూ.3 లక్షల చెక్‌ను బాధితురాలికి అందజేశారు. ఆమెకు ప్రతినెలా రూ.3 వేల పింఛన్‌ అందిస్తామని, రూ.20 లక్షల వరకు ఆమెకు వైద్యఖర్చులు భరిస్తామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement