సుప్రీంకోర్టు కొత్త సీజేగా దత్తు | HL Dattu set to be the next Chief Justice of India | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు కొత్త సీజేగా దత్తు

Sep 4 2014 2:30 AM | Updated on Sep 2 2018 5:50 PM

సుప్రీంకోర్టు కొత్త సీజేగా దత్తు - Sakshi

సుప్రీంకోర్టు కొత్త సీజేగా దత్తు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ హెచ్ ఎల్ దత్తును నియమించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ హెచ్ ఎల్ దత్తును నియమించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా ఈ నెల 27న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ దత్తు నియామకానికి  సంబంధించిన ఫైలును కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆమోదించి, ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలిసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించిన వెంటనే దత్తు నియామకానికి సంబంధించిన ఉత్తర్వు జారీ అవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. దత్తు వచ్చే ఏడాది డిసెంబర్ 2వరకు సీజేఐగా కొనసాగుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement