
సాక్షి, శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు శుక్రవారం హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన్ కీలక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు భద్రతా బలగాలు శుక్రవారం ఉదయం నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ఈ కార్డన్ సెర్చ్‌లో భాగంగానే ఫస్తూరా అడవుల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదే సమయంలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన గుల్జార్ దార్ అనే ఉగ్రవాదిని.. అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.