బియాస్ నదిలో ప్రారంభమైన గాలింపు | Himachal tragedy: Still Hunt on for missing students in Beas River | Sakshi
Sakshi News home page

బియాస్ నదిలో ప్రారంభమైన గాలింపు

Jun 11 2014 8:45 AM | Updated on Apr 3 2019 7:53 PM

బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

మండి: బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఆర్మీ, హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు బుధవారం ఉదయం బోట్ల సహాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం, బురద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలు బయటపడిన విషయం తెలిసిందే.

మరో 18 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్‌తో కలిపి మరో 19 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. పండో డ్యామ్‌లో నీటి మట్టాన్ని వీలైనంతగా తగ్గించి వెతికినా ప్రయోజనం కల్పించలేదు. ప్రమాదం జరిగి ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోవడంతో విద్యార్థులు ప్రాణాలతో ఉంటారన్న ఆశలు క్రమంగా ఆశలు సన్నగిల్లిపోతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement