'నీ కంటే నీ కొడుకే పెద్ద హీరో' | He's a bigger star than you: Arvind Kejriwal praises Emraan Hashmi's cancer survivor son | Sakshi
Sakshi News home page

'నీ కంటే నీ కొడుకే పెద్ద హీరో'

Apr 9 2016 10:48 AM | Updated on Sep 3 2017 9:33 PM

'నీ కంటే నీ కొడుకే పెద్ద హీరో'

'నీ కంటే నీ కొడుకే పెద్ద హీరో'

పసిప్రాయంలోనే కేన్సర్‌పై పోరాడి విజయం సాధించిన బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కుమారుడు ఆయాన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు.

ఇమ్రాన్ హష్మీని ఉద్దేశించి సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: పసిప్రాయంలోనే కేన్సర్‌పై పోరాడి విజయం సాధించిన బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కుమారుడు ఆయాన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. ఈ ఆరేళ్ల బాలుడు తండ్రి కంటే పెద్ద హీరో అని వ్యాఖ్యానించారు. తన కొడుకు జీవితం, కిడ్నీ కేన్సర్‌పై పోరాటం, తల్లిదండ్రులు అనుభవించిన మానసిక వేదన తదితర అంశాలతో హష్మీ, బిలాల్ సిద్దిఖీ రాసిన 'కిస్ ఆఫ్ లైఫ్' పుస్తకాన్ని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ ఆవిష్కరించారు. ఆయాన్‌కు కేన్సర్ సోకినట్టు తేలగానే అతణ్ని కెనడా తీసుకెళ్లి అత్యంత ఖరీదైన చికిత్స ఇప్పించారు.

ఏడు నెలలపాటు చేసే ఈ వైద్యం అత్యంత బాధాకరమైనదని హష్మీ పేర్కొన్నారు. ఆయాన్ వంటి చిన్నారులను ప్రభుత్వాలు ఆదుకోవాలని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. కిస్ ఆఫ్ లవ్ పుస్తకాన్ని కేన్సర్ బాధితులంతా చదవాలని పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement