తమిళనాడు తీరప్రాంతంలో భారీ వర్షాలు | Heavy rains to fall in tamilnadu coastal regions | Sakshi
Sakshi News home page

తమిళనాడు తీరప్రాంతంలో భారీ వర్షాలు

May 17 2016 2:17 PM | Updated on Sep 4 2017 12:18 AM

తమిళనాడు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది.

చెన్నై: తమిళనాడు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు మంగళవారం వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. చెన్నైకి 240 కిలోమీటర్ల దూరంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమైంది. దాంతో రానున్న 48 గంటల్లో అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

దీన్ని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో చెన్నై, తిరువళ్లుర్, క్రాంతిపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. చిత్తూరు, నెల్లూరులో కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement