ఢిల్లీలో భారీ వర్షం : తడిచిపోయిన మీడియా కెమెరాలు

Heavy Rain In New Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శుక్రవారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వాడివేడిగా సభ జరగాల్సిన సమయంలో భారీ వర్షం ఢిల్లీని ముంచెత్తింది. భారీ వర్షం దెబ్బకు ఢిల్లీలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై తొలిసారి అవిశ్వాసం జరగనుండటంతో దేశం మొత్తం ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది. 

అవిశ్వాస తీర్మానంతో వాడి వేడిగా జరగనున్న వర్షాకాల సమావేశాలను కవర్‌ చేయడానికి దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు ఢిల్లీలో పాగావేశాయి. అయితే శుక్రవారం కురిసిన భారీ వర్షానికి వార్తా సంస్థల ఎలక్ట్రానిక్‌ పరికరాలు తడిచిపోయాయి. కెమెరాలు, ఇతర కవరేజి వస్తువులు తడిసిముద్దయ్యాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top