కరోనా అలర్ట్‌ : హాట్‌స్పాట్స్‌గా 170 జిల్లాలు.. | Health Ministry Says 170 Districts In India Reported As Hotspots | Sakshi
Sakshi News home page

కరోనా అలర్ట్‌ : హాట్‌స్పాట్స్‌గా 170 జిల్లాలు..

Apr 15 2020 5:07 PM | Updated on Apr 15 2020 8:27 PM

 Health Ministry Says 170 Districts In India Reported As Hotspots - Sakshi

170 జిల్లాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉన్న 170 జిల్లాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ హాట్‌స్పాట్స్‌ను, గ్రీన్‌జోన్స్‌ను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపడతున్నామని ఆరోగ్య మంత్రత్వి శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో నిత్యావసర సేవలు మినహా రాకపోకలను పూర్తిగా నిలిపివేశామని చెప్పారు. హాట్‌స్పాట్స్‌లో ఇంటింటి సర్వే చేపడతామని తెలిపారు.   

తాజా కరోనా వైరస్‌ కేసుల కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తూ శాంపిల్స్‌ను సేకరిస్తాయని పేర్కొన్నారు. కరోనా రోగుల కోసం కోవిడ్‌ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పటివరకూ 11,933కు చేరాయని, మృతుల సంఖ్య 392కు పెరిగిందని వెల్లడించారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో 1305 మంది కోలుకోగా, 9756 కేసులు చురుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 1076 నూతన కేసులు వెల్లడవగా, 38 మంది మరణించారని చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement