అది జాతిపితను అవమానించటమే! | HC unhappy over donation box on Mahatma Gandhi’s memorial | Sakshi
Sakshi News home page

అది జాతిపితను అవమానించటమే!

Dec 5 2017 4:27 AM | Updated on Dec 5 2017 4:27 AM

HC unhappy over donation box on Mahatma Gandhi’s memorial - Sakshi

న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ స్మారకం (రాజ్‌ఘాట్‌) వద్ద విరాళాల హుండీని ఉంచటంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్య జాతిపితను అవమానించినట్లేనని పేర్కొంది. సేకరించిన నిధులను వేటికోసం వినియోగిస్తున్నారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. అయితే మహాత్ముడు స్థాపించిన ‘హరిజన్‌ సేవక్‌ సంఘ్‌’ ఈ హుండీని ఏర్పాటు చేసిందని.. ఈ సంస్థ అవసరాలకే నిధులు వినియోగిస్తున్నట్లు రాజ్‌ఘాట్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కమిటీ వివరించింది. దీనిపై కోర్టు మండిపడింది. ‘ఇదేనా మనం జాతిపితకు ఇచ్చే గౌరవం. భారతీయులతోపాటు వేలసంఖ్యలో విదేశీయులూ రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడ విరాళాల హుండీలు పెట్టడం గాంధీని అవమానించటమే’ అని స్పష్టం చేసింది. రాజ్‌ఘాట్‌లో కనీస ఏర్పాట్లపై వివరాలివ్వాలని సీపీడబ్ల్యూడీ చీఫ్‌ ఇంజనీర్‌ను ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement