51 ట్రాన్స్‌ఫర్లు.. బాగా అలవాటైపోయింది | Haryana IAS officer gets 51 transfers | Sakshi
Sakshi News home page

బదిలీలకు అలవాటుపడ్డ హర్యానా ఐఏఎస్‌ అధికారి

Nov 13 2017 5:21 PM | Updated on Nov 13 2017 5:21 PM

Haryana IAS officer gets 51 transfers - Sakshi

ఛండీగఢ్‌ : ‘‘ఎంతో చేయాలనుకున్నా. కానీ, మొత్తం నాశనం చేశారు. మరోసారి బదిలీ చేశారు. డేజా వు(ఫ్రెంచ్‌ భాషలో బాగా అలవాటు అయిపోయిందని అర్థం). ఈ ఆటంకం తాత్కాలిక విరామమే. రెట్టించిన ఉత్సాహంతో ముందకు సాగుతా’’ ఇది హర్యానా ఐఏఎస్‌ అధికారి అశోక్ ఖేమ్కా ట్విట్టర్‌పేజీలో గత రాత్రి కనిపించిన ఓ ట్వీట్‌.

నిజాయితీ పరుడైన అధికారిగా పేరున్న అశోక్‌(52) తన సర్వీస్‌లో ఇప్పటిదాకా 51 సార్లు బదిలీ అయ్యారు. సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారిక‌త ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించిన ఆయనను ఆ శాఖా మంత్రి కృష్ణ బేడీ స్వయంగా తొలగించటానికి కారణం.. మంత్రిపైనే అసంతృప్తి వ్యక్తం చేయటం.  నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాహాన్ని కృష్ణ  ఏడాది వాడుకోగా.. దానిపై అశోక్‌ బహిరంగా అసంతృప్తి వెల్లగక్కారు. దీంతో ఈసారి ఆయన బదిలీ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన క్రీడా మంత్రిత్వ శాఖ దగ్గర కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. తాను ఎక్కడున్నా.. అవినీతిని నిర్మూలించటమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు.

గతంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యక్తిగత సిబ్బందికి దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా పరిగణించటాన్ని అశోక్‌ అస్సలు ఊపేక్షించలేదు. ఇక సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారాన్ని(2012) రద్దు చేసింది కూడా ఈయనే కావటం విశేషం. ఆ తర్వాత రవాణా విభాగానికి మారిన ఆయన.. అక్కడా తన పట్టువీడలేదు. ఇలా 20 ఏళ్లలో ఆయనపై మొత్తం 51 సార్లు బదిలీ అయ్యారు. అన్నట్లు హర్యానాలో ఎక్కువ సార్లు ట్రాన్స్‌ఫర్‌ అయిన రికార్డు మాత్రం ప్రదీప్‌ కస్నీ(68సార్లు) పేరిటే ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement