breaking news
honest officers
-
51 ట్రాన్స్ఫర్లు.. బాగా అలవాటైపోయింది
ఛండీగఢ్ : ‘‘ఎంతో చేయాలనుకున్నా. కానీ, మొత్తం నాశనం చేశారు. మరోసారి బదిలీ చేశారు. డేజా వు(ఫ్రెంచ్ భాషలో బాగా అలవాటు అయిపోయిందని అర్థం). ఈ ఆటంకం తాత్కాలిక విరామమే. రెట్టించిన ఉత్సాహంతో ముందకు సాగుతా’’ ఇది హర్యానా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ట్విట్టర్పేజీలో గత రాత్రి కనిపించిన ఓ ట్వీట్. నిజాయితీ పరుడైన అధికారిగా పేరున్న అశోక్(52) తన సర్వీస్‌లో ఇప్పటిదాకా 51 సార్లు బదిలీ అయ్యారు. సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారికత ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించిన ఆయనను ఆ శాఖా మంత్రి కృష్ణ బేడీ స్వయంగా తొలగించటానికి కారణం.. మంత్రిపైనే అసంతృప్తి వ్యక్తం చేయటం. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాహాన్ని కృష్ణ ఏడాది వాడుకోగా.. దానిపై అశోక్ బహిరంగా అసంతృప్తి వెల్లగక్కారు. దీంతో ఈసారి ఆయన బదిలీ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన క్రీడా మంత్రిత్వ శాఖ దగ్గర కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. తాను ఎక్కడున్నా.. అవినీతిని నిర్మూలించటమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యక్తిగత సిబ్బందికి దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా పరిగణించటాన్ని అశోక్ అస్సలు ఊపేక్షించలేదు. ఇక సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారాన్ని(2012) రద్దు చేసింది కూడా ఈయనే కావటం విశేషం. ఆ తర్వాత రవాణా విభాగానికి మారిన ఆయన.. అక్కడా తన పట్టువీడలేదు. ఇలా 20 ఏళ్లలో ఆయనపై మొత్తం 51 సార్లు బదిలీ అయ్యారు. అన్నట్లు హర్యానాలో ఎక్కువ సార్లు ట్రాన్స్ఫర్ అయిన రికార్డు మాత్రం ప్రదీప్ కస్నీ(68సార్లు) పేరిటే ఉంది. -
నిజాయితీ అధికారులకు రక్షణ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణల విషయంలో మార్పులకు రంగం సిద్ధమైంది. సీబీఐ వంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించేముందు ఆయా శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిజాయితీ అధికారులను కాపాడేందుకు అవినీతి వ్యతిరేక బిల్లులో సవరణలు తీసుకొచ్చి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని గురువారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకునేలా ఈ బిల్లు ధైర్యాన్నిస్తుందని.. సుపరిపాలనకు ఇది కీలకమైన అంశమని మంత్రి అన్నారు. అవినీతి వ్యతిరేక సవరణ బిల్లును 2013, ఆగస్టు 19న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. తర్వాత దీన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదించారు. 2016, ఫిబ్రవరి 6న రాజ్యసభకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. గతేడాది ఏప్రిల్ 29న బిల్లులోని సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.