ఆ మీటింగ్ అద్భుతంగా జరిగింది: మోదీ | Had a wonderful meeting with Obama, says Narendra Modi | Sakshi
Sakshi News home page

ఆ మీటింగ్ అద్భుతంగా జరిగింది: మోదీ

Sep 30 2014 10:58 AM | Updated on Apr 4 2019 5:12 PM

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. తాము పలు అంశాల గురించి ఆ సమావేశంలో చర్చించుకున్నామన్నారు. ఈ విషయాలను ఆయన తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తాను రెండు దేశాల మధ్య భాగస్వామ్యంపై చర్చించుకున్నామని, ఇరు దేశాలు కలిసి మొత్తం మానవాళికి మేలు జరిగేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని కూడా ఆయన తెలిపారు. అమెరికాలో ఐదు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోదీ  వెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement