ఆ లేఖలో అన్నీ అబద్ధాలే: ఆజాద్ | gulam nabi azad statement on narendra modi one year administration | Sakshi
Sakshi News home page

ఆ లేఖలో అన్నీ అబద్ధాలే: ఆజాద్

May 29 2015 12:16 PM | Updated on Aug 15 2018 2:20 PM

ఆ లేఖలో అన్నీ అబద్ధాలే: ఆజాద్ - Sakshi

ఆ లేఖలో అన్నీ అబద్ధాలే: ఆజాద్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పెదవి విరిచారు.

హైదరాబాద్ :  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పెదవి విరిచారు.  ఏడాది పాలనపై మోదీ ప్రజలకు రాసిన లేఖలో అన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. ధరలు తగ్గాయనీ మోదీ చెబుతున్నది వాస్తవం కాదన్నారు. రైల్వే ప్రయాణ ఛార్జీలు, సరుకు రవాణా ఛార్జీలు పెంచారని ఆజాద్ విమర్శించారు.

మోదీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ధరలు తగ్గాయని మోదీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.   అంతర్జాతీయంగా పెట్రో ధరలు తగ్గినా...దేశంలో మాత్రం తగ్గలేదన్నారు. పెట్రోల్ ధర పెంచటంతో ప్రజలపై భారం పడిందన్నారు. ధరలు తగ్గాయన్న ప్రభుత్వ వాదనలో ఏమాత్రం నిజం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement