‘గాడిదలకున్న విశ్వాసం నీకు లేదుగా’ | Gujarat BJP fumes at Akhilesh insult says unlike him, donkeys are loyal | Sakshi
Sakshi News home page

‘గాడిదలకున్న విశ్వాసం నీకు లేదుగా’

Feb 21 2017 7:46 PM | Updated on Mar 29 2019 9:31 PM

‘గాడిదలకున్న విశ్వాసం నీకు లేదుగా’ - Sakshi

‘గాడిదలకున్న విశ్వాసం నీకు లేదుగా’

గుజరాత్‌ గాడిదలకోసం ప్రచారం చేయొద్దంటూ ప్రధాని నరేంద్రమోదీపై పరోక్షంగా విమర్శలు చేసిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌పై గుజరాత్‌కు చెందిన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లక్నో: గుజరాత్‌ గాడిదలకోసం ప్రచారం చేయొద్దంటూ ప్రధాని నరేంద్రమోదీపై పరోక్షంగా విమర్శలు చేసిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌పై గుజరాత్‌కు చెందిన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం కన్నతండ్రి సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌పైనే అఖిలేశ్‌ తిరగబడ్డారని విమర్శించారు.

గాడిదలు అఖిలేశ్‌ యాదవ్‌ మాదిరిగాకాదని, అవి చాలా విశ్వసనీయమైనవని, అలాంటి జంతువుల నుంచి అఖిలేశ్‌ నేర్చుకోవాల్సింది చాలా ఉందని గుజరాత్‌ బీజేపీ చీఫ్‌ జితు వాఘని అన్నారు. గుజరాత్‌ పర్యాటకం కోసం బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారాన్ని ఉటంకిస్తూ గుజరాత్‌ గాడదలకోసం ప్రచారం ఆపేయండంటూ అఖిలేశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలకై చదవండి..

‘గుజరాత్‌ గాడిదలకు ప్రచారం ఆపండి'

Advertisement
 
Advertisement
Advertisement