రామసేతును ధ్వంసం చేసే ప్రసక్తే లేదు: గడ్కారీ | Govt taking steps to bring back fisherment, Gadkari | Sakshi
Sakshi News home page

రామసేతును ధ్వంసం చేసే ప్రసక్తే లేదు: గడ్కారీ

Nov 5 2014 1:45 AM | Updated on Mar 29 2019 9:24 PM

సేతు సముద్రం షిప్పింగ్ ప్రాజెక్టును నిర్మించే క్రమంలో శ్రీరాముడు నిర్మించినట్టుగా భావిస్తున్న రామసేతును ధ్వంసం చేసే ప్రసక్తే లేదని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు.

చెన్నై/రామేశ్వరం: సేతు సముద్రం షిప్పింగ్ ప్రాజెక్టును నిర్మించే క్రమంలో శ్రీరాముడు నిర్మించినట్టుగా భావిస్తున్న రామసేతును ధ్వంసం చేసే ప్రసక్తే లేదని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. పర్యావరణానికి ఎలాంటి హానీ కలిగించని రీతిలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని వెల్లడించారు. మంగళవారం ఆయన తీర రక్షణ దళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సేతు సముద్రం నిర్మించదలచిన ప్రాంతాన్ని పరిశీలించారు. సేతు సముద్రం నిర్మాణానికి సంబంధించి ఇచ్చిన నివేదికలో పేర్కొన్న విధంగా ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు.

 

ఈ ప్రాజెక్టు  పూర్తయితే సముద్రం ద్వారా జరుగుతున్న వాణిజ్యం మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మరోవైపు షిప్పింగ్ రంగంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలనూ సమకూర్చుకోవాల్సి ఉందని, దీనికి సంబంధించి కొత్త చట్టాలు రూపొందించుకోవాలని గడ్కారీ చెన్నైలో చెప్పారు. ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక కోర్టు విధించిన ఉరి శిక్ష అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని, శిక్ష పడిన జాలర్లను వెనక్కి రప్పించేందుకు చర్యలు ముమ్మరం చేసిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement