ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు మళ్లీ మొదలయ్యాయి.
ఏవోబీలో రెవెన్యూ అధికారుల కిడ్నాప్
Jan 13 2017 2:20 PM | Updated on Mar 28 2019 5:07 PM
విశాఖపట్నం: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు మళ్లీ మొదలయ్యాయి. ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఉద్యోగులను జోడాంగ్ అటవీ ప్రాంతంలో అపహరించారు. పురుషోత్తమ్ బెహ్రా(బీపీఎం), లింగరాజ్ మజ్హి(వీఎడబ్ల్యు), హృషీకేశ్‌నాయక్(ఎంఐ), ప్రవీణ్ శరణ్(జేఈ), కమినికంట సింగ్(జేఈ), మనోరంజన్ సిసా(గ్రామ పెద్ద)లు కిడ్నాప్ అయిన వారిలో ఉన్నారు.
దీంతో ఆ ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. చిత్రకొండ బ్లాక్‌లోని జోడాంలో జరిగే ఎన్నికలను మావోయిస్టులు బహిహ్కరించారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు చేసేందుకు వీరు వెళ్లినపుడు మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.
Advertisement


