ఆధార్ బిల్లును చదరంగంగా మార్చారు! | Government's Next Move In The Aadhaar Game Of Chess | Sakshi
Sakshi News home page

ఆధార్ బిల్లును చదరంగంగా మార్చారు!

Mar 14 2016 5:40 PM | Updated on Sep 3 2017 7:44 PM

ఆధార్ బిల్లును చదరంగంగా మార్చారు!

ఆధార్ బిల్లును చదరంగంగా మార్చారు!

ఆధార్ బిల్లును ద్రవ్యబిల్లుగా ప్రవేశ పెట్టడం చదరంగం ఆట చర్యగా ఉందని... బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి మెజారిటీ లేకపోయినా ఆధార్ బిల్లును ద్రవ్యబిల్లుగా ప్రవేశ పెట్టి ఆమోదింపజేశారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. బిల్లుపై చర్చించేందుకు మరో రెండు రోజులపాటు సమావేశాలను పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఆధార్ బిల్లును చదరంగం ఆటలా మార్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం నుంచి అన్ని రకాల ప్రయోజనాలు, సబ్సిడీలు, సేవలు పొందేందుకు విశిష్ట గుర్తింపుగా ఉన్న ఆధార్ బిల్లు 2016ను చట్టబద్ధంగా మంజూరు చేయడంపై విపక్ష సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆధార్ బిల్లుపై చర్చించేందుకు మరో రెండు రోజులపాటు సమావేశాలను పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

ఆధార్ బిల్లును ద్రవ్యబిల్లుగా ప్రవేశ పెట్టడం చదరంగం ఆట చర్యగా ఉందని... బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి మెజారిటీ లేకపోయినా ఆధార్ బిల్లును ద్రవ్యబిల్లుగా ప్రవేశ పెట్టి ఆమోదింపజేశారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. మైనారిటీలో ఉన్న ప్రభుత్వం రాజ్యసభ ఆమోదంనుంచీ తప్పించుకునేందుకే ఆధార్ బిల్లును ద్రవ్య బిల్లుగా ప్రవేశ పెట్టిందని ఆరోపించాయి.

 

బిల్లును చర్చించేందుకు మాత్రమే అవకాశం కలిగిన ప్రభుత్వం... చట్టబద్ధమైన మార్పులు చేర్పులు చేసే అవకాశం లేకపోవడంతోనే వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఒకవేళ సిఫార్పులు చేసినా లోక్ సభ ఆమోదించే అవకాశం లేకపోవడంతో ఆధార్ బిల్లును ద్రవ్య బిల్లుగా ప్రవేశ పెట్టింది. అయితే హౌస్ నుంచి ఆమోదం పొందిన ద్రవ్య బిల్లుపై 14 రోజుల్లోపల చర్చించాల్సి ఉంది. అయితే విపక్షాల చర్చలకు సమయం లేకుండా చేసి, దొడ్డిదారిన బిల్లును ఆమోదింపజేసుకునే నేపథ్యంలో మరో రెండురోజుల్లో సమావేశాలు ముగుస్తుండగా నేడు రాజ్యసభలో బిల్లును అధికారికంగా స్వీకరించే అకాశం ఉంది.

అయితే ఎగువ సభలో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఆధార్ బిల్లును ప్రవేశ పెట్టిన తీరు చూస్తే అదే విషయం అర్థమౌతోందని  సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆరోపించారు. మరోవైపు చివరి మూడు సమావేశాలను పొడిగించి ప్రతిపక్షం అభ్యంతరాలను రికార్డు చేసే విధంగా బిల్లు రాజ్యసభలో చర్చించేందుకు అన్ని పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన వ్యాపార సలహా కమిటీ లేదా బిఏసీ ద్వారా ఆధార్ బిల్లును ద్రవ్యబిల్లుగా ఆమోదింపజేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

మార్చి 16తో పార్లమెంట్ సమావేశాలు ముగియనుండటంతో ఈ సమావేశాల్లో అతి తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంట్లో మంగళవారం ముగింపు ప్రసంగాలకే పరిమితమౌతుంది. మరోవైపు రాజ్యసభలో  నేటి సాయంత్రం రైల్వే బడ్జెట్ పై చర్చ ముగించి, కేంద్ర బడ్జెట్ ను కొనసాగించనుంది.  కేవలం రాజ్యసభ ఆమోదం నుంచి తప్పించుకునేందుకే ఎన్డీయే ప్రభుత్వం ఆధార్ బిల్లును ద్రవ్య బిల్లుగా తీసుకువచ్చిందని, ఇప్పటికైనా మరో రెండు రోజులపాటు సమావేశాలు పొడిగించి, ఆధార్ బిల్లుపై చర్చించే అవకాశం కల్పించాలని విపక్షాలు కోరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement