 
															ఎయిర్ ఇండియా విక్రయ కసరత్తు వేగిరం
													 
										
					
					
					
																							
											
						 ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
						 
										
					
					
																
	సాక్షి,న్యూఢిల్లీః ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ఇద్దరు ఆర్థిక సలహాదారులు, ఒక న్యాయ సలహాదారు నియామకానికి సంబంధించి గురువారం బిడ్లను ఆహ్వానించింది. 
	 
	ఎయిర్ ఇండియా దాని సబ్సిడరీలు, జాయింట్ వెంచర్‌లో వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్ కోసం బిడ్ల స్వీకరణ..అంటూ ప్రభుత్వం పబ్లిక్ నోటీసులు జారీ చేసింది. పెట్టుబడులు, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 12లోగా ఆయా సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరించనున‍్నట్టు నోటీసులో పేర్కొంది.