గూగుల్.. యాహూ, ఇదేం పాడుపని? | Google, Yahoo draw supreme court fire on abortion ads | Sakshi
Sakshi News home page

గూగుల్.. యాహూ, ఇదేం పాడుపని?

Jul 6 2016 7:53 AM | Updated on Oct 2 2018 4:09 PM

గూగుల్.. యాహూ, ఇదేం పాడుపని? - Sakshi

గూగుల్.. యాహూ, ఇదేం పాడుపని?

తాము ఎంత చెప్పినా పట్టించుకోకుండా సెక్స్ సెలెక్షన్, అబార్షన్లకు సంబంధించిన ప్రకటనలను పెడతారా అంటూ ప్రముఖ సెర్చింజన్లు గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్లపై సుప్రీంకోర్టు మండిపడింది.

తాము ఎంత చెప్పినా పట్టించుకోకుండా సెక్స్ సెలెక్షన్, అబార్షన్లకు సంబంధించిన ప్రకటనలను పెడతారా అంటూ ప్రముఖ సెర్చింజన్లు గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్లపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇలాంటి ప్రకటనల ద్వారా సెర్చింజన్లు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయనని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్య పరిష్కారానికి సాంకేతిక నిపుణులు, సెర్చింజన్ల ప్రతినిధులతో పది రోజుల్లోగా సమావేశం ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి తెలిపింది.

వాళ్లు బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా, వాటిని బ్లాక్ చేయడానికి ఏమీ చేయలేకపోతున్నామని, ఇలాంటి ప్రకటనలను ఆపి తీరాల్సిందేనని ధర్మాసనం చెప్పింది. ఇలాంటి అక‍్రమ ప్రకటనలను బ్లాక్ చేయడానికి ఏం చేస్తారో ఈనెల 25లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రానికి తెలిపింది. భారతీయ చట్టాలను ఉల్లంఘించే ఎలాంటి ప్రకటనలను తాము ఇవ్వడం లేదని సెర్చింజన్ల తరఫున హాజరైన న్యాయవాదులు చెప్పారు. అయితే వారి వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement