గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు: సీఎంపై ప్రతిపక్షాల దాడి

Gold Smuggling Scandal: Kerala CM Vijayan Faces Heat As protesters Rage - Sakshi

తిరువనంతపురం : కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. శుక్రవారం కోజికోడ్‌లో యూత్ లీగ్ కార్మికులు ఆందోళన చేపట్టడంతో వారిపై పోలీసులు లాఠీచార్జీ  చేశారు. ఈ ఘర్షణలో చాలా మంది నిరసనకారులకు గాయలయ్యాయి. కొచ్చిలో కూడా యువకుల నిరసన హింసాత్మకంగా మారింది. కన్నూర్‌లో పోలీసులు ఆందోళనకారులను నియంత్రించడానికి టియర్‌గ్యాస్ షెల్స్‌ను ఉపయోగించారు. కన్నూర్‌లోని సీఎం విజయన్ పూర్వీకుల ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. (గోల్డ్‌ స్మగ్లింగ్‌: ఎవరీ స్వప్న సురేశ్‌)

కాగా తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు చెందిన పార్మిల్లో 15 వేల కోట్ల రూపాయల విలువైన 30 కిలోల బంగారాన్ని జూలై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.  కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో స్వప్న సురేశ్‌తో సన్నిహితంగా ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై  కేసు దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలపడంతో గురువారం కేంద్రం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పజెప్పింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ ల్డ్‌ స్మగ్లింగ్‌ ఉగ్రవాద కార్యకలాపం లాంటిదేనని తెలిపింది. త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేస్తామని పేర్కొంది. (కేరళ రాజకీయాల్లో గోల్డ్‌ స్మగ్లింగ్‌ ప్రకంపనలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top