బికినీలను నిషేధించాలి | Goa government ban Bikinis | Sakshi
Sakshi News home page

బికినీలను నిషేధించాలి

Jul 1 2014 6:34 PM | Updated on Sep 2 2017 9:39 AM

బికినీల సంస్కృతిని నిషేధించానే డిమాండ్ వినిపిస్తోంది. బికినీలను వ్యతిరేకిస్తున్నది ఏ ప్రజా సంఘాల వారో కాదు గోవా హోం మంత్రి కావడం విశేషం.

పనాజీ: గోవా పేరు వినగానే అందమైన బీచ్లు గుర్తుకొస్తాయి. అమ్మాయిలు బికినీలతో అరేబియా సముద్రంలో కేరింతలు కొడుతుంటారు. బికినీల సంస్కృతిని నిషేధించానే డిమాండ్ వినిపిస్తోంది. బికినీలను వ్యతిరేకిస్తున్నది ఏ ప్రజా సంఘాల వారో కాదు గోవా హోం మంత్రి కావడం విశేషం.

అంతకుముందు గోవా ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ దావలికర్.. నైట్క్లబ్బుల్లో అమ్మాయిలు పొట్టి పొట్టి స్కర్టులు వేసుకురావడాన్ని నిషేధించాలని కోరారు. వాళ్లిలా పొట్టి స్క్రర్టులు వేసుకుని రావడం గోవా సంస్కృతికి ముప్పుగా మారిందని ఆయన పనజిలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో వ్యాఖ్యానించారు. ఎక్కడపడితే అక్కడ ఇలా పొట్టి స్కర్టులు వేసుకు రావడం గోవా సంస్కృతికి ఏమాత్రం సరిపోదని, ఇలాగే కొనసాగితే ఏమైపోవాలని.. తాము దీన్ని అంగీకరించేది లేదని మంత్రి అన్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement