హెలీ టూరిజంను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు.
పనాజీ: హెలీ టూరిజంను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. పవన్ హాన్స్ సంస్థతో కలిసి గోవా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, పనాజీ నుంచి అగ్వాడాకు మంగళవారం హెలీకాప్టర్ రైడ్స్ను ప్రారంభించింది.
అయితే ఈ హెలీ టూరిజం వల్ల స్థానికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని గోవా కాంగ్రెస్ నాయకుడు అజ్నెల్ ఫెర్నాండేజ్, మరో పదిమంది స్థానిక పంచాయతీ నాయకులు మండిపడ్డారు. రాస్తారోకో నిర్వహించి హెలీపాడ్ వైపుగా వస్తున్న వారిని గోవా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.